సైరా సెట్స్‌పై హేమాహేమీలు.. చిరంజీవికి రామ్ చరణ్ తోడ్బాటు.. అబ్బురపరిచే వర్కింగ్ స్టిల్స్
మెగా అభిమానుల ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గర పడింది. మెగా మూవీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చివరి క్షణంలో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా అప్‌డేట్స్ ఇస్తున్నారు సైరా మేకర్స్.

అబ్బురపరిచే వర్కింగ్ స్టిల్స్
ఇప్పటికే సైరాకు సంబంధించిన ఎన్నో అప్‌డేట్స్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా సైరా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది. మెగా అభిమానులను అబ్బురపరుస్తున్నాయి ఈ స్టిల్స్.

సెట్స్‌పై హేమాహేమీలు.. ఆన్‌లైన్ హంగామా
సైరా షూటింగ్ చేస్తున్న సమయంలో సెట్స్‌పై నటీనటులకు సంబంధించిన ముఖ్యమైన స్టిల్స్ రిలీజ్ చేశారు. పలు భాషల్లో హేమాహేమీలంతా ఈ స్టిల్స్‌లో కనిపిస్తుండటంతో ఆన్‌లైన్ హంగామా మొదలైంది.

అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్
సైరా సినిమాకు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సైరా సెట్స్‌పై కూడా పవన్ అందరినీ పలకరించారు. ఓ వర్కింగ్ స్టిల్‌లో అమితాబ్, పవన్ ముచ్చటలాడుకోవడం చూసి మురిసి పోతున్నారు ప్రేక్షకులు.

చిరంజీవికి రామ్ చరణ్ తోడ్బాటు
మరో వర్కింగ్ స్టిల్‌లో చిరంజీవికి రామ్ చరణ్ సహాయ పడుతుండటం చూడొచ్చు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి మేకప్‌ని, డ్రెస్ సర్దుతూ కనిపించారు రామ్ చరణ్.

విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్
విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ పోషించిన పాత్రలు, ఆ వర్కిల్ స్టిల్స్ కూడా రిలీజ్ చేసి తెలుగుతో పాటు అన్ని బాషా ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ తీసుకొచ్చారు మేకర్స్.

ప్యాన్ ఇండియా మూవీ
సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా 'సైరా' పై క్యూరియాసిటీ పెరిగిపోయింది.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి.

సైరా సెన్సార్ రిపోర్ట్
ఇక సైరా సెన్సార్ రిపోర్ట్ విషయానికొస్తే.. సైరా నరసింహా రెడ్డి చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
సైరా సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మేర థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ రూపంలో బిజినెస్ చేసిందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సైరా థియేట్రికల్ రైట్స్ 108.6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముగిసిన వివాదం
ఇక గత కొంతకాలంగా ఉయ్యాలవాడ వంశీయులు చేసిన హంగామా, కోర్ట్ కేసు అన్నీ వెనక్కి తీసుకున్నారు. సైరా విడుదలను స్వాగతిస్తూ వారు వెనక్కి తగ్గడం విశేషం.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పత్రాలు పోషించారు.


Click it and Unblock the Notifications











