తాప్సీ ప్రేమ కథ ఇదే.. అలా పరిచయమైన ప్రియుడు.. అసలు విషయం ఏంటంటే?
తెలుగు తెరకు అందాల ముద్దుగుమ్మగా పరిచయమైంది తాప్సీ. అనతి కాలంలోనే ఓ మంచి నటిగా తెలుగు నాట గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ వచ్చిన గుర్తింపుతో పక్క ఇండస్ట్రీల్లో ఛాన్స్‌లు కొట్టేసింది. ఈక్రమంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పింక్, బాద్లా, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్, గేమ్ ఓవర్ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకోని తాప్సీ.. తాజాగా మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. కాబోయే వారి గురించి కూడా హింట్ ఇచ్చింది. అవేంటో ఓ సారి చూద్దాం.

పెళ్లి గురించే అడుగుతున్నారు..
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎక్కడికి వెళ్లినా నా పెళ్లిని గురించి అడుగుతున్నారు. నేను ప్రేమలో పడ్డాను .. నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను సినిమా ఫీల్డ్ కిలో సంబంధించిన వ్యక్తి కాదు .. బిజినెస్ మేన్ కూడా కాదు. అతను ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను.

పిల్లలు కావాలనుకున్నప్పుడే..
ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాననేది మాత్రం చెప్పలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది గనుక ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. పెళ్లి ఎప్పుడు జరిగినా ఆ వేడుక సింపుల్ గానే ఉంటుంది. కొంతమంది బంధువులు .. కొంతమంది స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చింది.

తాప్సీ ప్రియుడు అతడే..
తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ని కుటుంబ సభ్యులకి పరిచయం చేసి వాళ్ళు ఓకే చెప్పాక ప్రపంచానికి పరిచయం చేసినట్టు తెలుస్తోంది. తాప్సీ ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో. అయితే వీరిద్దరికి పరిచయం ఎలా జరిగింది? ఎవరి వల్ల అయింది? అనే విషయాలు ఆసక్తికరంగా మారింది.

సోదరి ద్వారా పరిచయం..
తాప్సీ సోదరి షగున్ పన్న ద్వారానే మాథియాస్ బో పరిచయమయ్యాడు. ఒకానొక సారి బ్యాడ్మింటన్ లీగ్‌లో కలుసుకున్న వీరు అక్కడి నుంచి ప్రయాణం చేశారు. ఈ మేరకు మాథియాస్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. షగున్ పన్నుతో సహా తాప్సీ ఫ్యామిలీ కూడా మాథియాస్‌తో బాగానే కలిసిపోయినట్టు ఫోటోల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి పరిచయం ప్రేమగా మారింది.. అది కూడా త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











