తమన్నా సింహాద్రి మొహం మీద నీళ్లు కొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్

బిగ్ బాస్ షో మూడో సీజన్‌లో శ్రీ ముఖి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఆ సీజన్‌లో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా గానీ బయటకు వచ్చాక అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నం చేసింది. ఒక్క రాహుల్‌తో మాత్రం అంతగా కలిసిపోయినట్టు కనిపించడం లేదు. పైగా ఎవరి గ్రూపులు వారివే అన్నట్టు కొంత మంది మాత్రమే కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు కలిసి చేసుకున్న ఏ పార్టీలోనూ శ్రీముఖి కనిపించలేదు.

అందరూ కలిసి అలా..

అందరూ కలిసి అలా..


బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది కలుస్తుంటారు. స్పెషల్ ఈవెంట్లలో నానా రచ్చ చేస్తుంటారు. రాహుల్ బర్త్ డే వేడుకలు, శివజ్యోతి గృహప్రవేశ వేడుకలు ఇలా ఎన్నో సందర్భాల్లో అందరూ కలిశారు. కానీ శ్రీముఖి అండ్ కో మాత్రం హాజరవ్వలేదు. శ్రీముఖి తమన్నా బాబా భాస్కర్ అంతా ఓ గ్యాంగ్‌లా ఆడేవారు.

శ్రీముఖి రచ్చ..

శ్రీముఖి రచ్చ..

శ్రీముఖి ప్రస్తుతం ఓ టాక్ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉమెనియా అనే షోలో శ్రీముఖి మహిళా సెలెబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తోంది. మహిళా సెలెబ్రిటీలంటే.. పునర్నవి, విష్ణుప్రియ వంటివారుకూడా ఉన్నారు. కానీ ఈ సారిమాత్రం తమన్నా సింహాద్రిని తీసుకొచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో చుక్కలు చూపించిన తమన్నా.. మళ్లీ ఇలా శ్రీముఖి షోలో మెరిసింది.

విపరీతమైన నెగెటివిటీ..

విపరీతమైన నెగెటివిటీ..

బిగ్ బాస్ షో సీజన్లలోనే అత్యంత నెగెటివిటినీ మూటగట్టుకున్న కంటెస్టెంట్‌గా తమన్నా సింహాద్రి రికార్డులకెక్కింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. రవికృష్ణను టార్గెట్ చేసిన తీరుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రవర్తన ఎంత ఘోరంగా ఉందో ఆమెకు వచ్చిన ఓటింగ్ శాతం, ఓట్లలోనే తెలిసిపోయింది.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా శ్రీముఖి ఉమెనియా షోలో తమన్నా సింహాద్రి రచ్చ చేసింది. నాటి బిగ్ బాస్ సంగతులను ముచ్చటించుకున్నారు. రవికృష్ణ టాపిక్‌ను కూడా శ్రీముఖి లేవనెత్తింది. పండు, పప్పు అంటూ అప్పుడు ఎలా ఇమిటేట్ చేసేదో ఇప్పుడు కూడా అలానే చేసింది. ఇక ఈ షోలో శ్రీముఖి కంటే తమన్నాయే యాంకర్‌గా బిల్డప్ ఇచ్చేసింది. చివరకు ఓ చాలెంజ్ ఆట ఆడారు.

Recommended Video

Bigg Boss Telugu 3: బాబా శాపంతో శిల్ప అవుట్!! | Episode 57 Highlights | Filmibeat Telugu

నీళ్లను మొహం మీద కొట్టేసింది..

వాటర్ చాలెంజ్ అంటూ శ్రీముఖి ఓ ఆట పెట్టింది. ఇందులో తమన్నాపై శ్రీముఖి.. శ్రీముఖిపై తమన్నా నీళ్లను పోశారు. అయితే ఈ చాలెంజ్‌లో శ్రీముఖి గెలిచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్ని గ్లాసుల నీళ్లు మొహం మీద కొట్టినా భయపడలేదు. కానీ తమన్నా సింహాద్రి మాత్రం ఒక్క గ్లాస్ నీళ్లకే భయపడింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X