మాటల్లో చెప్పలేను.. డాక్టర్లు, నర్స్‌లపై తమన్నా ఎమోషనల్

కరోనా వస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఎన్నో సూచనలు చేసింది. కానీ కరోనా మాత్రం రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంటోంది. కరోనా వారికి వీరికీ అని తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ముఖ్యంగా సెలెబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. ఈ మధ్య తమన్నా కూడా కరోనా బారిన పడింది. అయితే దాదాపు రెండు వారాల చికిత్స క్వారంటైన్‌తో కరోనా నుంచి కోలుకుంది.

కరోనా నుంచి కోలుకున్న తరువాత తమన్నా బయటి ప్రపంచాన్ని చూసి మురిసిపోయింది. కరోనా నెగెటివ్ రావడంతో అలా బయటకు వచ్చి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. మామూలుగా తమన్నాకు మొదట చిన్నగా ఫీవర్ వంటి లక్షణాలు వచ్చాయట. పరీక్షలు చేస్తే పాజిటివ్ అని ఫలితం తేలడటంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా తమన్నా కాస్త ఎమోషనల్ అయింది.

Tamannaah Bhatia ABout Doctors ANd Nurses Who Treated Covid

Recommended Video

Tamannaah Tests COVID 19 Positive, Admitted in Hyderabad Hospital || Oneindia Telugu

తనకు వైద్యం అందించిన హాస్పిటల్, డాక్టర్లు, నర్సులపై తమన్నా ప్రేమను కురిపించింది. కాంటినెంటల్ హాస్పిటల్ వైద్య బృందానికి, నర్సులకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నా ఆరోగ్యం దెబ్బతింది.. వీక్ అయ్యాను.. ఎంతో భయపడ్డాను. కానీ మీరు మాత్రం నాలో ధైర్యాన్ని నింపారు.. బాగా ట్రీట్ చేశారు.. ఆ దయాగుణం.. జాగ్రత్తగా చూసుకున్న తీరు.. అన్నీ కలిసి నాకు నయం అయ్యేలా చేశాయి అంటూ తమన్నా ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X