సమంత కోసం తమన్నా.. షో కోసం బాగానే ప్లాన్ చేశారు!
సమంత ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ షో అంతగా క్లిక్ అవ్వలేదు.మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండ చేసి గ్రాండ్‌గా ప్రారంభించారు. మొత్తానికి సమంత మొదటి సారిగా హోస్టింగ్ చేయడంతో షో మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. అలా ఇప్పటి విజయ్, రానా, నాగ్ అశ్విన్ వచ్చారు. ఇక సినీ సెలెబ్రిలను కాకుండా స్పోర్ట్స్ పర్సనాల్టీలను కూడా సమంత పిలిచింది.
గత వారంలో సైనా నెహ్వాల్ జంట వచ్చింది. అయితే అందరూ కూడా చిరంజీవితో షూట్ చేసిన ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. సామ్ జామ్ కోసం చిరు అలా పోజిచ్చిన ఫోటోలే సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఆ స్టైల్ గ్రేస్ చూసి అందరూ షాక్ అయ్యారు. సమంతతో చిరు ముచ్చట్లు పెడితే ఎలా ఉంటుంది.. చిరునుంచి ఎలాంటి విషయాలను బయటకు లాగుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే సమంత ప్రస్తుతం తమన్నాతో చిట్ చాట్ చేసినట్టు కనిపిస్తోంది. సమంత షో కోసం తమన్నా వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి షోలో చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 11న యాప్‌లో అందుబాటులోకి రానుంది. తమన్నా ఆహా యాప్ కోసం లెవెన్త్ అవర్ అనే షో వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇప్పుడు ఇలా సమంత షోకు వచ్చేసింది.


Click it and Unblock the Notifications











