Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వివేక్ కెరీర్లోనే మర్చిపోలేని 6 పాత్రలు.. దర్శకుల టెన్షన్ లేకుండా చేసిన నటుడు
స్టార్ కమెడియన్ వివేక్ మరణాన్ని సినీ తారలు నమ్మలేకపొతున్నారు. కొన్ని గంటల క్రితమే సంతోషంగా మీడియాలో కనిపించిన వ్యక్తి సడన్ గా కళ్ళు మూయడం ఏమిటనేది అంతు చిక్కడం లేదని అంటున్నారు. అయితే ఆ అగ్ర నటుడు నటనపరంగా ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి 5 ముఖ్యమైన క్యారెక్టర్స్ పై ఒక లుక్కేస్తే...
కమెడియన్ వివేక్ ఫోటో గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని అరుదైన ఫోటోలు
బాయ్స్..
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత లాభాలు అంధించకపోయినప్పటికి ఆ సినిమాలో కంటెంట్ అందరికి కనెక్ట్ అయ్యింది. ఇక ఆ సినిమాలో మంగళం అంకుల్ అనే పాత్రలో ఆయన చేసిన కామెడీ ఒక లెవెల్.. అలాగే సందేశాన్ని ఇచ్చిన ఎమోషనల్ సీన్స్ మరొక లెవెల్ లో ఉంటాయి.
అపరిచితుడు..
మరోసారి దర్శకుడు శంకర్ టెన్షన్ ఉండకూడదు అని అపరిచితుడు సినిమా కామెడీ ట్రాక్ ను మొత్తం వివేక్ పైనే పడేశాడు. అందులో హీరో ఫ్రెండుగా చారీ అనే పాత్రలో వివేక్ పండించిన కామెడీ ఇప్పటికి కూడా మీమ్స్ లో వాడుతుంటారు. ముఖ్యంగా ట్రైన్ సీన్, లవ్ ట్రాక్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
సింగం సిరీస్..
సూర్య - హరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సినిమాలో వివేక్ ఒక కానిస్టేబుల్ పాత్రలో నటించారు. అలాంటి ఫుల్ యాక్షన్ సినిమాలో కామెడీ వర్కౌట్ కావాలి అంటే చాలా కష్టం. ఇక వివేక్ ఆ భారాన్ని మోసి తన సొంత టైమింగ్ తో దర్శకుడికి టెన్షన్ లేకుండా చేశాడు. అనుష్కతో కూడా అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్వించింది.
రఘువరన్ బి.టెక్
వివేక్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తాడు. సహా ఉద్యోగిగా ధనుష్ తో ఉంటూ తనదైన శైలిలో కామెడీ పండించాడు. ముఖ్యంగా లవర్ స్వర్ణ పుష్ప ఫోన్ ట్రాక్ సీన్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఈ పాత్రకు తెలుగులో ఉత్తేజ్ డబ్బింగ్ చెప్పి అన్ని వర్గాల ప్రేక్షకులకు కు కనెక్ట్ అయ్యేలా చేశారు.
కాష్మోరా
కార్తీ నటించిన కాష్మోరా సినిమాలో తెలుగులో కూడా సాలీడ్ వసూళ్లను అందుకుంది. ఇక ఇందులో హీరో పాత్రకు తండ్రిగా నటించిన వివేక్ భయానక సన్నివేశాల్లో అద్భుతంగా నవ్వించాడు. ఈ హారర్ కామెడీ సినిమా విజయంలో వివేక్ పాత్ర కూడా కొంత ఉందని చెప్పవచ్చు.
Recommended Video
శివాజీ..
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ సినిమాలో దాదాపు ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాలో కేవలం కామెడీ అనే కాకుండా ఎమోషనల్ సీన్స్ లలో కూడా వివేక్ చాలా అద్భుతమైన నటనను కనబరిచాడు. శంకర్ ఈ సినిమాలో కామెడీ పార్ట్ కోసం చాలా ఆలోచించాడట. అయన ఆలోచనలను చాలా ఈజీగా కనెక్ట్ అయిన వివేక్ కామెడీ ట్రాక్ కు తన సొంత ఆలోచనలతో కూడా హెల్ప్ చేశారు.