మళ్లీ పెళ్లి చేసుకున్న సామ్రాట్.. వేడుకల్లో సందడి చేస్తోన్న తనీష్, దీప్తి సునయన
బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి గురించి, పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. సామ్రాట్ విషయంలో మొదటి వివాహం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. రెండో సీజన్‌లో బిగ్ బాస్ షోలో సామ్రాట్ రెడ్డి ఇంట్లో ఉన్న సందర్భంలో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అతని భార్య విడాకులు అంటూ సామ్రాట్‌పై కేసులు వేసింది. సామ్రాట్‌పై వచ్చిన కేసుల వల్ల అప్పుడు బిగ్ బాస్ షోలోంచి మధ్యలో వెళ్లాల్సి వచ్చింది. అలా ఈ ఇద్దరి గురించి మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

తేజస్వీతో సన్నిహితంగా..
అయితే బిగ్ బాస్ షోలో తేజస్వీ సామ్రాట్ అతి సన్నిహితంగా ఉన్నారు. ఈ ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. చూసే ప్రేక్షకులకు ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ఫీలింగ్ కలిగింది. దీప్తి సునయన తనీష్, సామ్రాట్ తేజస్వీ ఈ నలుగులు ఓ జట్టుగా ఉండేవారు. అందులో మరీ ముఖ్యంగా తేజస్వీ సామ్రాట్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు.

ప్రేమ, పెళ్లి అంటూ..
అయితే బయటకు వచ్చాకు సామ్రాట్ తేజస్వీలపై పుకార్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.. పెళ్లి చేసుకుంటున్నారు అంటూ కొన్ని రూమర్లు వినిపించాయి. కానీ తాము మాత్రం మంచి స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. సామ్రాట్ తన మొదటి భార్య హర్షితకు మధ్య ఉన్న విబేధాల గురించి అందరికీ తెలిసిందే.

సామ్రాట్‌పై కేసులు..
సామ్రాట్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడంటూ మొదటి భార్య హర్షిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఇద్దరి వ్యవహారం ఏదో రకంగా రచ్చకు వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరికి విడాకులు అయ్యాయి. సామ్రాట్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.
కాకినాడలో సందడి..
సామ్రాట్ శ్రీలిఖితకు నేడు ఉదయం పది గంటల 39 నిమిషాలకు కాకినాడలో పెళ్లి జరిగింది. ఈ వేడకకు దీప్తి సునయన, తనీష్ హాజరయ్యారు. ఈ పెళ్లిలో ఈ ఇద్దరూ తెగ సందడి చేశారు. ప్రస్తుతం సామ్రాట్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











