తాన్యా హోప్... అందం చూస్తే తన్మయత్వం పొందడం ఖాయం (ఫోటోలు)

తాన్యా హోప్... ఈ పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండక పోవచ్చు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తెలుగు సినిమాల ద్వారానే ఆమె తన సినీ కెరీర్ మొదలు పెట్టారు. బెంగుళూరులో పుట్టి, ముంబైలో పెరిగిన ఈ 23 ఏళ్ల కుర్రబ్యూటీ తన సెక్స్ అప్పీల్‌తో సంచనం క్రియేట్ చేస్తోంది.

ఇంటర్నెట్‌లో తాన్యా హోప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాన్యా హోప్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల్లో ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. ఈ భామ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుంటూ... హాట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

ఎవరీ తాన్యా హోప్

ఎవరీ తాన్యా హోప్

తాన్య హోప్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది, తెలుగు సినిమాల ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేసిన ఆమె మిస్ ఇండియా కోల్‌కతా 2015 కిరీటం దక్కించుకుంది. పెమినా మిస్ ఇండియా 2015 ఫైనలిస్ట్ కూడా.

సినిమా రంగంలోకి

సినిమా రంగంలోకి

2016లో వచ్చిన ‘నేను శైలజ' మూవీలో ‘నైట్ ఈజ్ స్టిల్ యంగ్' అనే ప్రత్యేక గీతంలో నటించడం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తన అందం, యాక్టింగ్ టాలెంటుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో నిత్యా అనే పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

తెలుగులో వరుస సినిమాలు

తెలుగులో వరుస సినిమాలు

నేను శైలజ మూవీలో స్పెషల్ సాంగ్ తర్వాత తాన్య హోప్ వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు' మూవీతో పాటు జగపతి బాబు మూవీ ‘పటేల్ సర్' చిత్రంలో కీలకమైన పాత్రలో నటించే చాన్స్ కొట్టేసింది.

హీరోయిన్‌గా తొలి చిత్రం

హీరోయిన్‌గా తొలి చిత్రం

తాన్య హోప్ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘పేపర్ బోయ్'. ఈ మూవీ ద్వారా వి జయశంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.

తమిళంలో కూడా...

తమిళంలో కూడా...

కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ తాన్యా హోప్ అడుగు పెట్టారు. అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన ‘తడం' మూవీ ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

తను పుట్టిన రాష్ట్రంలో

తను పుట్టిన రాష్ట్రంలో

తమిళం తర్వాత తాన్య హోప్ కన్నడ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా రూపొందిన ‘యజమాన' సినిమా ద్వారా సాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాన్య హోప్ బెంగుళూరులోనే జన్మించిన సంగతి తెలిసిందే.

కన్నడలో వరుస ఆఫర్లు

కన్నడలో వరుస ఆఫర్లు

‘యజమాన' చిత్రం మంచి విజయం అందుకోవడంతో తాన్యా హోప్ కన్నడలో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఉద్గర్ష, అమర్, చిత్రాలు చేశారు. ప్రస్తుతం హోం మినిస్టర్, ఖాకీ చిత్రాల్లో నటిస్తున్నారు.

డిస్కో రాజా మూవీలోనూ..

డిస్కో రాజా మూవీలోనూ..

ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ ‘డిస్కో రాజా'లో కూడా తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు ధరళ ప్రభు అనే తమిళం చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన 4 చిత్రాలు ఆల్రెడీ విడుదలవ్వగా మరో 4 చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

తాన్యా హోప్

తాన్యా హోప్

తాన్య హోప్ బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. బెంగళూరులోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంది. తర్వాత ఇంగ్లాండ్లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ అంతర్జాతీయ సంబంధాలపై పూర్తి చేసింది. తర్వాత పూణేలో టియారా ట్రైనింగ్ స్టూడియోలో మోడలింగ్ శిక్షణ తీసుకుంది. 2015లో FBB ఫెమినా మిస్ ఇండియా కోల్‌కతాను గెలుచుకుంది.

స్టార్ హీరోయిన్ అవ్వాలనే

స్టార్ హీరోయిన్ అవ్వాలనే

సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇక్కడ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించాలని తాన్య హోప్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో బాలీవుడ్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X