Taraka Ratna: అలేఖ్య రెడ్డి గురించి షాకింగ్ నిజాలు.. అందుకే భర్తకు దూరం.. పెళ్లికి ముందే తారకరత్నతో!

ప్రముఖ హీరో నందమూరి తారకరత్న కొద్ది రోజుల క్రితమే గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాదు, అతడిని బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇప్పటికీ ఈ నందమూరి హీరో ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తారకరత్న ఆస్పత్రిలో ఉండగానే అతడి భార్య అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ, పర్సనల్ సీక్రెట్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలేం జరిగింది? ఆమెకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

తారకరత్న పరిస్థితి ఏంటి?

తారకరత్న పరిస్థితి ఏంటి?

గుండెపోటుకు గురైన తారకరత్న నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్నారు. మొదట అవయవాలు పని చేయకపోయినా ఇప్పుడు ఆ ఫంక్షనింగ్ మొత్తం సరిగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, మెదడుకు సంబంధించిన పనితీరు మాత్రం మెరుగుపడలేదని తెలిసింది. మెడికల్ రిపోర్టులను బట్టి అతడిని విదేశాలకు తరలించే అవకాశం ఉందని టాక్.

హైలైట్ అవుతోన్న అలేఖ్య

హైలైట్ అవుతోన్న అలేఖ్య

నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ప్రాణాల కోసం పోరాడుతుండగా.. బయట మాత్రం అతడి భార్య అలేఖ్య రెడ్డి బాగా హైలైట్ అవుతోన్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కంటే కూడా ఎక్కువగా ఆమె గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అలేఖ్య రెడ్డి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరదలి కూతురు కావడంతో పాటు తారకరత్నను ప్రేమ వివాహం చేసుకోవడమే.

అతడితో పెళ్లి... విడిపోయి

అతడితో పెళ్లి... విడిపోయి

తారకరత్నను వివాహం చేసుకోడానికి ముందే అలేఖ్య రెడ్డికి పెళ్లి జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని ఆమె వివాహం చేసుకుంది. అతడితో దాదాపు నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో సందీప్ రెడ్డికి అలేఖ్య విడాకులు ఇచ్చేసినట్లు తెలిసింది.

తారకరత్న మూవీలో వర్క్

తారకరత్న మూవీలో వర్క్

ఫ్యాషన్ డిజైనర్ అయిన అలేఖ్య రెడ్డి.. సందీప్ రెడ్డితో విడాకులు అయిన తర్వాత కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న నటించిన 'నందీశ్వరుడు' సినిమాకు కూడా పని చేసింది. ఇందులో అతడికి ఆమెనే స్వయంగా కాస్ట్యూమ్స్ తయారు చేశారు. ఆ సమయంలోనే అలేఖ్య - తారకరత్న మధ్య స్నేహం పెరిగింది.

ప్రేమలోనే.. పెళ్లి వద్దంటూ

ప్రేమలోనే.. పెళ్లి వద్దంటూ

'నందీశ్వరుడు' సినిమా సమయంలో స్నేహితులు అయిన అలేఖ్య రెడ్డి - తారకరత్న.. ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. వీళ్ల వ్యవహారం తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. సినిమా బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల అలేఖ్య ఫ్యామిలీ.. అంతకు ముందే విడాకులు తీసుకోవడం వల్ల తారకరత్న కుటుంబం వీళ్లిద్దరి పెళ్లికి అడ్డుగా నిలిచినట్లు తెలిసింది.

ఆ గుడిలోనే వీళ్ల మ్యారేజ్

ఆ గుడిలోనే వీళ్ల మ్యారేజ్


ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోకపోయినా అలేఖ్య రెడ్డి - నందమూరి తారకరత్న తమ బంధాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యారు. తర్వాత నుంచి వీళ్ల వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతూ ఓ పాపకు జన్మనిచ్చారు.

రెండింటిలో.. అంతలోనే

రెండింటిలో.. అంతలోనే


అలేఖ్య రెడ్డితో వివాహం తర్వాత తారకరత్న సినీ కెరీర్‌ను కూడా మళ్లీ కొత్త ఉత్సాహంతో ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే, ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు అనుగుణంగానే అడుగు వేస్తున్నాడు. అంతలోనే ఇటీవలే తారకరత్న గుండెపోటుకు గురై చావు బతుకుల్లో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X