ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాం.. నా రూంలో ఉన్నందకు థ్యాంక్స్.. చీర్స్ చెబుతున్న తేజస్వీ
తేజస్వీ జీవితం బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్‌లా తయారైంది. షోలో పార్టిసిపేట్ చేయకముందు తేజస్వీని అందరికీ మంచి అభిప్రాయం ఉండేది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కేరింత, ఐస్ క్రీమ్ వంటి సినిమాలతో బాగా ఆకట్టుకుంది. అయితే తెరపై చూసిన తేజస్వీకి, బిగ్ బాస్ తేజస్వీకి చాలా తేడా ఉండటంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి లోనయ్యారు. తేజస్వీ చేసిన తప్పుడు ఆరోపణలు, పగబట్టినట్టు కౌశల్‌ను ప్రతీ విషయంలో టార్గెట్ చేయడంతో బాగా నెగెటివిటీ పెరిగింది. బయటకు వచ్చాక కూడా అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది.

అవకాశాలు తగ్గాయి..
బిగ్ బాస్ షో ద్వారా తేజస్వీకి వెండితెర, బుల్లితెర అవకాశాలు అంతగా రాలేదు. బిగ్ బాస్ తరువాత చేసిన లాఫ్టర్ షో బెడిసికొట్టింది. ఆ తరువాత అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అటు వెండితెరకు, బుల్లితెరకు దూరం కావాల్సి వచ్చింది. ఇక బోల్డ్ కంటెంట్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన వెబ్ సిరీస్‌లపై తేజస్వీ మళ్లింది.

కమిట్‌మెంట్ పేరిట..
కమిట్‌మెంట్ అనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో తేజస్వీ రెచ్చిపోయి నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్స్, ఫోటోషూట్లు రచ్చ రచ్చ చేశాయి. ఇక నిత్యం బీచ్‌లు, ట్రావెలింగ్ మిస్ అవుతున్నా అంటూ షేర్ చేసే బికినీ ఫోటోలు తెగ హల్చల్ చేస్తుంటాయి.

రూమ్‌కు వచ్చి ఐదేళ్లు..
రూమ్‌కు వచ్చి ఐదేళ్లు పూర్తి అవుతున్నసందర్భంగా తేజస్వీ కాస్త ఎమోషనల్ అయింది. ఈ మేరకు తన రూం మేట్స్‌కు చీర్స్ చెబుతున్నట్టు చేతిలో డ్రింక్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ అన్ని విషయాలను గుర్తు చేసుకుంది. ఈ మేరకు తేజస్వీ చేసిన కామెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
Recommended Video

ఎన్నో ఇచ్చాడు.. తీసుకెళ్లాడు..
ఈ ఇంటికి వచ్చి ఐదేళ్లు అవుతున్నాయి. ఎన్నో ఇచ్చినందుకు.. ఇంకెంతో నేర్చుకునేందుకు, ఎదిగేందుకు ఎన్నింటినో దూరం చేసిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ ఇంటినే కాకుండా ఎన్నో మెమోరీస్‌ను నాతో పాటు షేర్ చేసుకున్నందుకు వైశాలి, రోహన్, మహిలకు ఎంతో థ్యాంక్స్..ఈ ఇంటిని నేను ఎంతో ప్రేమిస్తున్నాన..ఇలాంటి ఇంటి ఓనర్‌ను నేను ఇంత వరకు చూడలేదు అంటూ తేజస్వీ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











