ఆయనలా ఎవ్వరూ చేయలేరు.. తేజస్వీ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర, వెండితెరపై తేజస్వీ పుట్టించే సెగలు ఏ రేంజ్‌లో ఉంటాయో.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతకు మించి ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో, వెరైటీ ఫోటో షూట్లతో తేజస్వీ నానా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం తేజస్వీ మాత్రం దేశంలోని వివిద రాష్ట్రాల్లో టూరిజం స్పాట్‌లో హల్చల్ చేస్తోంది. అసలే ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకునే తేజస్వీ లాక్ డౌన్ ఫ్రస్ట్రేషన్‌ను అలా తీర్చేసుకుంటోంది.

లాక్డౌన్‌లో అలా..
తేజస్వీ లాక్డౌన్‌లో ఇంటి పట్టునే ఉంటూ రోజూ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌ను పలకరిస్తూ ఉండేది. లైవ్ సెషన్స్ పెట్టేది.. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది. ఎక్కువ మంది పెళ్లి గురించి ప్రశ్నలు అడిగేవారు. కరోనా వ్యాక్సిన్ వచ్చాకపెళ్లి చేసుకుంటానని సరదాగా సమాధానం చెప్పడం అప్పట్లో తెగ వైరల్ అయింది.

ఇంటి నుంచి బయటకు..
తేజస్వీ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఉత్తర భారతదేశాన్ని ఓ సారి చుట్టి వచ్చేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. సిమ్లా, మనాలి, హిమాలయాలకు తేజస్వీ వెళ్లింది. అక్కడ వివిధ ప్రదేశాల్లో దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.

వెరైటీ ఫోటో షూట్లు..
తేజస్వీ వెరైటీ ఫోటో షూట్లకు పెట్టింది పేరు. హాట్ హాట్ ఫోజులతో భిన్న రకాల యాంగిల్స్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తేజస్వీ షేర్ చేసే ఫోటోలు, ఆ ఫోటో షూట్లు చేసే వ్యక్తి గురించి తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. అదిరి పోయే ఫోటో షేర్ చేస్తూ ఫోటోగ్రాఫర్‌పై కామెంట్స్ చేసింది.

ఆయనలా ఎవ్వరూ..
తేజస్వీ తన బ్యాక్ చూపిస్తూ వయ్యారాలు ఒలకిస్తూ పోజు ఇచ్చింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఏదో ఒకరోజు మళ్లీ మీరు వెనక్కి తిరిగి వస్తారు..ఇదంతా ఎందుకు జరిగిందో చూస్తారు.. ఆయనలా మరెవ్వరూ కూడా ఫోటో షూట్ చేయలేరు.. అంటూ శరత్ శెట్టి గురించి పొగిడేసింది. విభిన్న యాంగిల్స్‌లో కొత్తగా చూపెట్టడం శరత్ శెట్టి ప్రత్యేకత అని చెప్పకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











