సీక్రెట్‌గా తేజస్వి పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్ చేసిన బ్యూటీ
బిగ్ బాస్ ఫేమ్ తేజస్వీ మడివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై మంచి పాత్రలనే చేస్తూ వచ్చిన తేజస్వీ.. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌లో దుమ్ములేపింది. బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామరస్ క్వీన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆమె ప్రవర్తన, కౌశల్‌తో గొడవలు, ఆమె మాట్లాడే తీరుతో ప్రేక్షకుల్లో కొంత నెగెటివిటీని పెంచాయి. దీంతో ఆమెకు బిగ్‌బాస్ షో వల్ల నష్టమే జరిగింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమె కెరీర్ కాస్త మందగించింది.

అలా ఫేమస్..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఐస్ క్రీమ్ వంటి సినిమాలతో తేజస్వీ బాగానే పాపులర్ అయింది. ఆ ఫేమ్‌తోనే బిగ్ బాస్ షోలో అడుగు పెట్టింది.అక్కడ సామ్రాట్‌తో రహస్య బంధం, తనీష్, దీప్తి సునయలతో స్నేహం ఇలా హౌస్‌లో ఉన్నన్ని రోజులు బాగానే సందడి చేసింది.

వెబ్‌సిరీస్‌లతో బిజీగా..
తేజస్వీకి బిగ్‌బాస్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివిటీ బాగా పెరిగింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక చేసిన లాఫ్టర్ షో ఫట్ అయింది. సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు. అందుకే ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టింది.

బర్త్ డే రోజున స్పెషల్ కిక్..
నిన్న (జులై 3) తేజస్వీ బర్త్ డే. ఈ మేరకు కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హాట్ లుక్స్‌తో తేజస్వీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఇదంతా ఓ వైపు అనుకుంటే.. తేజస్వీ బర్త్ డే పార్టీ ఓ రేంజ్‌లో జరిగింది.

హౌస్‌మేట్స్ స్పెషల్ విషెస్..
తేజస్వీకి బిగ్ బాస్ హౌస్‌మేట్స్ దాదాపు అందరూ విషెస్ చేశారు. గీతా మాధురి, రోల్ రైడా, అమిత్ ఇంకా అందరూ బర్త్ డే విషెస్ చేశారు. ఇక తేజస్వీ తన గ్యాంగ్‌తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. డిస్కోలంటూ బాగానే చిందులు వేసినట్టు కనిపిస్తోంది.
Recommended Video

భర్త అంటూ ఓ ఫోటో..
అయితే అంతా బాగానే ఉంది గానీ.. తేజస్వీ షేర్ చేసిన ఓ ఫోటో పెట్టిన కామెంట్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మై హస్బండ్ అంటూ ఒకరి ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెకు పెళ్లి ఎప్పుడు అయింది? సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఇంతకీ అతను ఎవరు? వంటి చిక్కుముడుల్లాంటి ప్రశ్నలతో తలలు గోక్కుంటున్నారు. మరి వీటన్నంటిపై తేజస్వీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











