CCL 2024 Points Table తెలుగు వారియర్స్‌ను వెంటాడిన దురదృష్టం.. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి అంటే?

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 ముగింపు దశకు చేరుకొన్నది. మూడు వారాలుగా ఇండియాలోని ప్రధాన నగరాల్లో నువ్వే నేనా? అన్నట్టు.. ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోకుండా మ్యాచులు రసవత్తరంగా సాగాయి. అయితే ఈ టోర్నమెంట్ చివరి, తుది నాలుగో వారంలో ఆడే మ్యాచుల్లో టైటిల్ విజేత ఎవరనేది డిసైడ్ అయిపోతుంది. ఈ లీగ్‌లో ఎవరెవరు ఎన్ని పాయింట్లు సాధించారు.. మిగితా మ్యాచుల వివరాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఏ జట్టుకు ఎన్ని పాయింట్స్ అంటే?
సీసీఎల్ 10 సీజన్‌లో ఫైనల్ పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది.. కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 4 మ్యాచులు ఆడి 3 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దాంతో 1.37 రన్ రేట్‌తో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండో స్థానం విషయానికి వస్తే.. 4 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ టైగర్స్ జట్టు 1 మ్యాచ్‌లో ఓడిపోయి.. 3 మ్యాచుల్లో గెలిచి 6 పాయింట్లతో నిలిచింది. ఇక మూడో స్థానంలో చెన్నై రైనోస్ నిలిచింది. 4 మ్యాచులు ఆడిన ఈ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. దాంతో చెన్నైకు 6 పాయింట్లు లభించాయి. నాలుగో స్థానంలో నిలిచిన ముంబై హీరోస్ 6 పాయింట్లతో నిలిచింది. 3 గెలిచి.. 1 మ్యాచ్‌లో ఓడిపోయింది.

Telugu Warriors 2024

తెలుగు వారియర్స్‌కు దురదృష్టం
అయితే తెలుగు వారియర్స్ జట్టును దురదృష్టం వెంటాడింది. ఈ టీమ్ 4 మ్యాచులకు గాను.. 3 మ్యాచుల్లో గెలిచి.. 1 మ్యాచ్ ఓడిపోయి 6 పాయింట్లతో టాప్ 4 జట్లతో సరిసమానంగా నిలిచింది. అయితే ముంబై జట్టు 0.462 రన్ రేట్‌తో ఉండగా.. తెలుగు వారియర్ జట్టు 0.456 రన్ రేట్‌తో వెనుకబడింది. దాంతో క్వాలిఫయర్ రౌండ్‌లోకి వెళ్లే అవకాశం మిస్ చేసుకొన్నది.

ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్
ఈ టోర్నిలో భాగంగా తిరువనంతపురంలోని క్రికెట్ స్టేడియంలో మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో బెంగాల్ టైగర్స్ పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది.

ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్
సీసీఎల్ 2024 లీగ్‌లో తొలి ఎలిమినేటర్ మ్యాచ్ తిరువనంతపురంలోని స్టేడియంలోనే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్ మార్చి 15వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది.

Telugu Warriors 2024

ఫైనల్ మ్యాచ్ కోసం జట్టు
ఇక రెండో క్లాలిఫైర్ మ్యాచ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్ 1 ఓటమి చెందిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ విజేత పోటీపడుతుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలోనే మార్చి 16వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్ విజేత ఫైనల్‌లోకి దూసుకెళ్తుంది.

ఫైనల్ మ్యాచ్ ఇలా..
ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. క్వాలిఫయర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ మ్యాచ్ 3 విజేత ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ సంవత్సరం, సీజన్ 10 విజేతగా నిలిచి ట్రోఫిని దక్కించుకొంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X