CCL 2025: తెలుగు వారియర్స్ పోటీపడే మ్యాచ్‌లు.. ఎవరితో? ఎక్కడ? ఢీ కొడుతున్నారంటే?

సినీతారల క్రికెట్ లీగ్ ఛాంపియన్ క్రికెట్ లీగ్ 2025 ప్రారంభానికి సర్వం సిద్దమవుతున్నది. 14 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ టాప్ క్రికెట్ లీగ్ 11వ సీజన్‌ ఆరంభం కాబోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొంటున్న జట్లన్నీ తమ ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించేందుకు విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తూ.. ఇంటర్నేషనల్ ప్లేయర్లకు ఏ మాత్రం తగ్గకుండా తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సీసీఎల్ 2025 (CCL 2025) లీగ్‌లో దిగ్గజ టీమ్ తెలుగు వారియర్స్ జట్టు ఆడే మ్యాచుల వివరాలు, ఇతర అంశాల్లోకి వెళితే..

సీసీఎల్ పోటీలను నిర్మాత, సినీ ప్రముఖుడు విష్ణు వర్ధన్ ఇందూరి వ్యవస్థాపకుడిగా దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలకు చెందిన ఆటగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. భాషల వారీగా జట్లను ఏర్పాటు చేసి క్రికెట్ లీగ్‌ను ప్రారంభించాలనే కలను 14 ఏళ్ల క్రితం సాకారం చేసుకొన్నారు. మధ్యలో కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ.. వాటిని అధిగమించి 11వ సీజన్ వరకు ఈ పోటీలను నడిపించడంలో సక్సెస్ అయ్యారు.

Telugu Warriors Matches List in The Championship Cricket League 2025 CCL 2025 Here is Venue and date details

తెలుగు వారియర్స్ జట్టుకు ఓనర్లుగా దగ్గుబాటి వెంకటేష్, సచిన్ జోషీలు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది పోటీలకు రికా వ్యాలీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. సోహ్రాబ్ అఫ్రత్ జట్టుకు సేవలందించేందుకు సిద్దమయ్యారు. ఇక తెలుగు వారియర్స్ జట్టుకు అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

తెలుగు వారియర్స్ జట్టులో కీలక ఆటగాళ్లలో తమన్ ఎస్ఎస్ ఒకరు కాగా, ఇంకా టీమ్‌లో నిఖిల్, సుధీర్ బాబు, సచిన్ జోషి, ఆది సాయి కుమార్, ప్రిన్స్, అశ్విన్, ఆదర్శ్, సామ్రాట్, రఘు, నంద కిషోర్, ఖయ్యూం ఆలీ, హరీష్ తదితరులు జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఈ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జెర్సీని రిలీజ్ చేశారు.

Telugu Warriors Matches List in The Championship Cricket League 2025 CCL 2025 Here is Venue and date details

తెలుగు వారియర్స్ ఆడబోయే మ్యాచులు, ప్రదేశాల వివరాల్లోకి వెళితే..

1వ మ్యాచ్:
తొలి మ్యాచ్ ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరులో కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు తలపడుతుంది.

2వ మ్యాచ్:
ఛాంపియన్స్ క్రికెట్ లీగ్ (సీసీఎల్) టోర్నీలో భాగంగా తెలు వారియర్స్ జట్టు రెండో మ్యాచ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతారు. ఈ మ్యాచ్‌లో భోజ్‌పురి దబంగ్ జట్టుతో తెలుగు వారియర్స్ జట్టు తలపడుతుంది.

3వ మ్యాచ్
ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై రైనోస్ జట్టుతో తెలుగు వారియర్స్ జట్టు ఆడుతుంది.

లీగ్ రౌండ్‌లో తెలుగు వారియర్స్ జట్టు చివరి మ్యాచ్‌ సూరత్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ బెంగాల్ టైగర్స్ జట్టుతో తెలుగు వారియర్స్ జట్టు తలపడుతుంది.

ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 3 ఛానెల్, డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ద్వారా నేరుగా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. ఔత్సాహిక క్రికెట్ అభిమానులు ఈ మ్యాచును చూడాలనుకొనే వారు బుక్ మై షో, టికెట్ జీనీ, జొమాటో డిస్ట్రిక్ట్స్ యాప్ నందు కొనుగోలు చేసుకోవవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X