CCL 2024 రోమాలు నిక్కబొడిచే మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఓటమి.. అఖిల్ సేనకు కంగుతినిపించిన కేరళ స్ట్రైకర్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 టోర్నీలో భాగంగా తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌ రసవత్తరంగా ముగిసింది. కేరళ జట్టు, తెలుగు వారియర్స్ జట్టు ఆటగాళ్లు నువ్వా? నేనా అనే విధంగా ఆడటంతో క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వాతావరణం స్టేడియంలో కనిపించింది. 10 ఓవర్లలో 77 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు ఓటమి పాలైంది. రోమాలు నిక్కబొడిచే మ్యాచ్‌లో అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కేరళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

టాస్ గెలిచిన కేరళ స్ట్రైకర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొన్నది. అయితే ఆరంభంలోనే కేరళ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే అరుణ్ ధాటిగా ఆడుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. మరో వైపు బెన్నీ కూడా నిలకడగా ఆడటంతో తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఆది 2 వికెట్లు, ప్రిన్స్ 1 వికెట్ పడగొట్టారు.

Telugu Warriors Won on Kerala Strikers in Celebrity Cricket League 2024

ఇక తొలి ఇన్నింగ్స్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు నిదానంగా పరుగులు చేసింది. అఖిల్ 17 పరుగులు చేసి అవుటవ్వగా, సుశాంత్ 6 పరుగులు, సచిన్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత అశ్విన్, తమన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. అశ్విన్ 21 బంతుల్లో 47 పరుగులు, థమన్ 12 బంతుల్లో 26 పరుగులు చేశారు. దాంతో తెలుగు వారియర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 17 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళ జట్టులో అనూప్ 2 వికెట్లు, అలెగ్జాండర్ 1 వికెట్ పడగొట్టారు.

CCL 2024

తెలుగు వారియర్స్ నిర్దేశించిన 17 పరుగుల అధిక్యం తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కేరళ జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిద్దార్థ్ 1 వికెట్, రాజీవ్ 0, బెన్నీ 0 పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన శివరామ్ 22 పరుగులు, అర్జున్ 23 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేసింది. వివేక్ 19 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. దాంతో విజయానికి తెలుగు వారియర్స్ జట్టు 77 పరుగులు చేయాల్సి వచ్చింది. తెలుగు వారియర్స్ జట్టులో ఆది 2 వికెట్లు, తమన్ 1, రఘు 1, ప్రిన్స్ 1 వికెట్ పడగొట్టారు.

10 ఓవర్లలో 77 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తమన్, అశ్విన్, సుధీర్ బాబు వెంటవెంటనే అవుట్ అవ్వడంతో అఖిల్, ఆదర్శ్ బాలకృష్ణన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించారు.

అయితే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే 9వ ఓవర్‌లో 8 పరుగులు సాధించారు. దాంతో చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తొలి రెండు బంతుల్లో కేరళ బౌలర్ అలెగ్జాండర్ వరుసగా రెండు వికెట్లు తీసి షాకిచ్చాడు. అయితే మూడో బంతికి పిన్స్ సింగిల్ తీసుకొని ఆదర్శ్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. నాలుగో బంతి వైడ్ కావడం, ఆ తర్వాత బంతి కూడా వైడ్ కావడంతో 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక నాలుగో బంతిని ఆదర్శ్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో విజయం సాధించడం ఖాయంగా కనిపించింది.

ఇక తెలుగు వారియర్స్ జట్టుకు రెండు బంతుల్లో 2 పరుగులు కావాలి. ఆ సమయంలో అలెగ్జాండర్ 5వ బంతిని విసిరాడు. అయితే బంతిని కొట్టడంలో బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో 1 బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే చివరి బంతిని వేసిన తర్వాత బ్యాట్స్‌మెన్ వైడ్ అనుకొని వదిలేశాడు. కానీ అంపైర్ వైడ్‌గా ఇవ్వలేదు. అయితే బై రన్ తీసే ప్రయత్నంలో ప్రిన్స్ రనౌట్ అయ్యాడు. దాంతో హైడ్రామాగా సాగిన మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్ విజయం సాధించింది. తెలుగు వారియర్స్ చేజేతులా ఓటమి కోరి తెచ్చుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X