TFI Fans Cricket League చిరంజీవి టీమ్‌ను ఓడించిన నితిన్ జట్టు.. ఒంటరి పోరాటంతో గెలుపు దిశగా!

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ (TFI Fans Cricket League) టోర్నీలో భాగంగా బుధవారం (జనవరి 31)న హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సినీ హీరో నితిన్‌కు చెందిన తమ్ముడు ఎలెవెన్ (Thammudu XI) జట్టు ఘన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు చెందిన జై చిరంజీవి జట్టుతో విసిరిన సవాల్‌ను సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తమ్ముడు ఎలెవెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జై చిరంజీవ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. ఈ మ్యాచ్‌లో అభి, వినోద్ రెడ్డి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. అభి 38 పరుగులు, వినోద్ 14 పరుగులు చేసి అవుటైన తర్వాత జట్టు సభ్యులు వెంటవెంటనే అవుట్ అయ్యారు.

TFI Fans Cricket League: Chiranjeevis Jai Chiranjeeva Team defeated by Nithiins Tammudu XI Team

క్రాంతి రెడ్డి 10, రవి 16, అనిల్ 11 పరుుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్ల కంటే ముందుగానే.. అంటే 19.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. తమ్ముడు జట్టులో మారుఫ్ 3 వికెట్లు, నోమ్యాన్ 3, రాజేశ్, సాయి, అభిరాం చెరో వికెట్ పడగొట్టారు.

జై చిరంజీవ జట్టు పెట్టిన 134 పరుగుల టార్గెట్‌ను చేరుకొనేందుకు బ్యాటింగ్ చేపట్టిన తమ్ముడు లెవెన్ జట్టుకు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్ నోమాన్ సున్నా పరుగులకు అవుట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన ధర్మ కూడా 4 పరుగులకు అవుట్ కావడంతో 22 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది.

అయితే రాఘవ అమ్మిరెడ్డి ఒంటరిపోరాటం చేస్తూ స్కోరుబోర్టుపై రన్స్‌ను పరుగులు పెట్టించాడు. అమ్మిరెడ్డి 83 పరుగులు, సత్యప్రసాద్ 37 పరుగులు చేయడంతో 15.2 ఓవర్లలోనే 2వ వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి తమ్ముడు ఎలెవెన్ జట్టు విజయాన్ని అందుకనొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X