TFI Fans Cricket League ఉత్కంఠ భరిత పోరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గెలుపు.. చేజారిన చిరు ఫ్యాన్స్ విజయం
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో గురువారం జనవరి 1వ తేదీన రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జట్టు జై చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జట్టు హంగ్రీ చీటాస్ జట్టు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నువ్వా నేనా అనే విధంగా సాగిన మ్యాచ్‌లో హంగ్రీ చీటా జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో జై చిరంజీవి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. చిరంజీవి జట్టు తరఫున సంతోష్ మిశ్రా, అభి ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే అభి 3 పరుగులు చేసి అవుటవ్వడంతో పరుగులు వేగం మందగించింది. ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్‌లో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయడానికి అడ్డంకిగా మారింది.

జై చిరంజీవి జట్టులో సంతోష్ మిశ్రా 35 పరుగులు, క్రాంతి 19, సంతోష్ 13 పరుగులు, సంజయ్ 35 పరుగులు చేశారు. మిగితా వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పవన్ కల్యాణ్ అభిమానుల జట్టులో రాజ్ 3వ వికెట్లు, ఫణిదర్ 4 వికెట్లు, యష్ 2 వికెట్లు పడగొట్టారు. దాంతో జై చిరంజీవి జట్టు 17.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది.
పవర్ స్టార్ ఫ్యాన్స్ జట్టు 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. అయితే ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును ఉదయ్ కిరణ్, యష్ ఆదుకొన్నారు. 7 వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు విజయాన్ని అందించారు. ఉదయ్ కిరణ్ 36 పరుగులు, యష్ 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశారు. 17.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
జై చిరంజీవ జట్టులో అశోక్ మూడు వికెట్లు, సాయి 2 వికెట్లు, మరో బౌలర్ 1 వికెట్ సొంతం చేసుకొన్నారు. ఓ దశలో హంగ్రీ చీటాస్ కుప్పకూలడంతో జై చిరంజీవ జట్టుదే విజయం అనుకొన్నారు. కానీ అనూహ్యంగా హంగ్రీ చీటాస్ నిలదొక్కుకోవడంతో చిరంజీవి అభిమానుల జట్టు విజయం చేజారింది.


Click it and Unblock the Notifications











