TFI Fans Cricket League జై చిరంజీవ జట్టు ఘన విజయం.. లక్ష్యం ముందు రవితేజ ఫ్యాన్స్‌ బోల్తా.. టార్గెట్ ఎంతంటే?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ (TFI Fans Cricket League) లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జట్టు జై చిరంజీవ ఘన విజయం సాధించింది. రవితేజ ఫ్యాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. అయితే ధాటిగా బ్యాటింగ్ చేసిన జై చిరంజీవ జట్టు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

Recommended Video

భంగపడ్డ Raviteja ఫ్యాన్స్ Jai Chiranjeeva Vs Team Eagle | TFI Fans Cricket League | Telugu Filmibeat

టాస్ గెలిచిన జై చిరంజీవి జట్టు సంతోష్ మిశ్రా, అభి ఇన్నింగ్స్‌ను సుడిగాలిలా ప్రారంభించారు. సంతోష్ పించ్ హిట్టింగ్‌తో కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. సెంచరీ సాధించడం సులభమే అని భావిస్తున్న సమయంలో 75 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన క్రాంతి రెడ్డితో కలిసి అభి స్కోరు బోర్డుపై పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారు. అభి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్రాంతి 39 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులు చేశారు.

TFI Fans Cricket League: Jai Chiranjeeva Team won on Team Eagle by 59 Runs in Hyderabad

అయితే స్కోరు 250 పరుగులు దాటుతుందా అనిపించింది. కానీ టీమ్ ఈగిల్ జట్టు బౌలర్లు చివరి ఓవర్లలో కట్టడి చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. టీమ్ ఈగిల్ జట్టులో బాలా 2 వికెట్ుల, అభిరాం 2 వికెట్లు, జగన్, పవన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన టీమ్ ఈగిల్ జట్టులో శ్రీరామ్ ధాటిగా ఆడారు. 52 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పరుగుల వేగం మందగించడంతో లక్ష్య ఛేదన కష్టంగా మారింది. శ్రేయాస్ 15 పరుగులు, బాలా 22, రాకేష్ 42 పరుగులు చేసి అవుటయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. దాంతో జై చిరంజీవి జట్టు 59 పరుగులు తేడాతో విజయం సాధించింది.

TFI Fans Cricket League: Jai Chiranjeeva Team won on Team Eagle by 59 Runs in Hyderabad

జై చిరంజీవ జట్టులో సంజయ్ 3 వికెట్లు, అవేష్ ఓ వికెట్ సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంతోష్‌ను అభినందించారు. ఈ విజయంతో జై చిరంజీవ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X