TFI Fans Cricket League అల్లు అర్జున్ టీమ్ దారుణ ఓటమి..ఫైనల్లో పవన్ కల్యాణ్ జట్టు!
టాలీవుడ్‌లో సినీ హీరోల అభిమానుల క్రికెట్ టోర్నమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ముగిసింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ పవన్ కల్యాణ్ అభిమానుల జట్టు హంగ్రీ చీటాస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జట్టు ఐకాన్ స్టార్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పవన్ కల్యాణ్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న పరిమిత ఓవర్ల మ్మాచ్‌లో హంగ్రీ చీటాస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. జట్టు ఓపెనర్లు వంశీ, మణిగోపి వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జగదీష్ ఐకాన్ స్టార్స్ జట్టు బౌలర్లను చీల్చి చెండాడు. కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 118 పరుగులు చేశాడు.

హంగ్రీ చీటాస్ జట్టులో యష్ 30 పరుగులు, సౌరభ్ 29 పరుగులు, రాజ్ 10, కార్తీక్ 16 పరుగులు చేశారు. దాంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఐకాన్ స్టార్స్ జట్టులో నారాయణ 2 వికెట్లు, బాబీ, విలియమ్ జో చెరో వికెట్ పడగొట్టారు.
హంగ్రీ చీటాస్ జట్టు విసిరిన 227 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐకాన్ స్టార్స్ జట్టులో ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను బౌలర్లు కుప్పకూల్చారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ హంగ్రీ చీటాస్ జట్టును ఎదుర్కోలేకపోయారు. దాంతో 13.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేసింది. దాంతో 114 పరుగుల తేడాతో ఐకాన్స్ స్టార్ ఓటమి పాలైంది.
ఐకాన్ స్టార్స్ జట్టులో అత్యధికంగా బాబీ 23 పరుగులు, నారాయణ 22 పరుగులు, పాండు 22 పరుగులు, విలియమ్ జో 20 పరుగులు చేశారు. మిగితా వారందరూ రెండంకెల స్కోరును చేయలేకపోయారు. హంగ్రీ చీటాస్ జట్టులో రాజ్ 3 వికెట్లు, ఫణిదర్ 2, యష్ 1, రాకేష్ 3 వికెట్లు తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జగదీష్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ ఫ్యాన్ క్రికెట్ లీగ్ గత నాలుగు రోజులుగా రసవత్తరంగా పోటాపోటీగా జరుగుతున్నది. ఈ టోర్నీలో పవన్ కల్యాణ్ అభిమానుల జట్టు హంగీ చీటాస్ వరుస విజయాలతో తొలి ఫైనలిస్టుగా మారింది.


Click it and Unblock the Notifications











