TFI Fans Cricket League ఉత్కంఠ పోరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గెలుపు.. 2 పరుగుల తేడాతో బాలయ్య టీమ్ ఓటమి!

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోల అభిమానుల జట్లుగా ఏర్పడి ఆడుతున్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ టోర్ని ఆసక్తికరంగా సాగుతున్నది. ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సినీ అభిమానులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ అభిమానుల జట్టు హంగ్రీ చీటాస్, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్‌బీకే లయన్స్ జట్ల మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో బాలకృష్ణ అభిమానుల జట్టు NBK Lions టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. Hungry Cheetahs జట్టులో వంశీ, మణి ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. వంశీ 29 పరుగులు, మణి 24 పరుగులు చేసి అవుటయ్యారు.

TFI Fans Cricket League: Pawan Kalyans Hungry Cheetahs won over Nandamuri Balakrishnas NBK Lions

ఆ తర్వాత సౌరభ్ 28 పరుగులు, జగదీష్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో 45 పరుగులు చేసిన రాజ్ జట్టును గౌరవ ప్రదమైన స్కోరుకు సహకారం అందించాడు. టెయిల్ ఎండర్స్ విఫలం కావడంతో హంగ్రీ చీటాస్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

హంగ్రీ చీటాస్ జట్టు విసిరిన 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆదిలోనే తడబడింది. గీతానంద్ 10, రామ్ 11 పరుగులు చేసి అవుటయ్యారు. పెద్ది 45 పరుగులు, విక్రాంత్ రాజ్ 23, ధీరజ్ 30 పరుగలు చేయడంతో విజయ పథంవైపు నడిచినట్టు కనిపించింది.

అయితే చివర్లలో హంగ్రీ చీటాస్ జట్టు బౌలింగ్‌తో కట్టడి చేయడంతో పరుగుల వేగం మందగించింది. దాంతో ఒత్తిడికి లోనైన బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. చివరి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ కావడంతో విజయానికి రెండు పరుగుల దూరంలో బోల్తా కొట్టారు. కేవలం 11.2 ఓవర్లలోనే 10 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు.

ఉత్కంఠగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో విజయం ద్వారా హంగ్రీ చీటాస్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొన్నది. దాంతో క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థిని ఎదుర్కొనేందుు పవన్ కల్యాణ్ అభిమానుల జట్టు వ్యూహాలకు సిద్దమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X