TFI Fans Cricket League ఎన్టీఆర్ జట్టు చిత్తు చిత్తు.. ఫైనల్‌‌లో ప్రభాస్ జట్టు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ప్రభాస్ అభిమానుల జట్టు రోరింగ్ రెబెల్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జట్టు టైగర్స్ ఎలెవన్ మధ్య జరిగిన ఏకపక్షంగా ముగిసింది. రోరింగ్ రెబెల్స్ జట్టు నిర్దేశించిన టార్గెట్‌ను అందుకోలేక దారుణంగా విజయం ముందు చతికిలపడింది. దాంతో ప్రభాస్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఎన్టీఆర్ జట్టు సెమిఫైనల్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎన్టీఆర్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రెబల్ స్టార్ ప్రభాస్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఇంతియాజ్ ఆబిద్ జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 32 పరుగలు చేసి ఇంతియాజ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రకాశ్ రెడ్డి.. అబిద్‌తో దాటిగా ఆడాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.

TFI Fans Cricket League: Prabhas Roaring Rebels won Against Jr NTRs Tigers XI in Semi Final match

రోరింగ్ రెబెల్స్ జట్టులో అబిద్ అత్యధికంగా పరుగులు సాధించాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు. ప్రకాశ్ రెడ్డి 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. సాయినాథ్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 57 పరుగులతో, అంకిత్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. టైగర్స్ ఎలెవన్ జట్టులో నీరజ్, హర్ష, సంతోష్ చెరో వికెట్ పడగొట్టారు.

253 పరుగులు భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టైగర్స్ ఎలెవన్ జట్టు ఆదిలోనే విఫలమైంది. ఓపెనర్లు ఇద్దరు, మరో బ్యాట్స్‌మెన్ స్కోరు బోర్డుపై 11 పరుగులు ఉండగానే అవుట్ అయ్యారు. దాంతో లక్ష్య ఛేదన కష్టంగా మారింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్స్ ఎవరు కూడా నిలదొక్కుకోపోవడంతో 17.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. దాంతో రోరింగ్ రెబెల్స్ జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.

టైగర్స్ ఎలెవన్ జట్టులో అత్యధికంగా సూర్య కిరణ్.. 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 72 పరుగులు చేసింది. ఆ తర్వాత క్విన్ష్ 18 పరుగులు, సంతోష్ 16 పరుగులు చేశారు. మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రోరింగ్ రెబెల్స్ జట్టులో శివాజీ 3 వికెట్లు, అక్షయ్, ఇంతియాజ్ రెండేసి వికెట్లు, సాయినాథ్, అంకిత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ టోర్నిలో ఇప్పటికే ఫైనల్‌లోకి చేరిన హంగ్రీ చీటాస్ జట్టుతో రోరింగ్ రెబెల్స్ జట్టుతో తలపడనున్నది. శనివారం ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్ మ్యాచ్ అప్‌డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X