TFI Fans Cricket League గర్జించిన ప్రభాస్ ఫ్యాన్స్.. చిత్రు చిత్తుగా ఓడిన నాగ్ కింగ్ టీమ్!

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ అభిమానుల క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల జట్టు రోరింగ్ రెబల్స్ జట్టు ఘన విజయం సాధించింది. రెబల్ స్టార్ జట్టు చెలరేగి ఆడటంతో నాగ్ కింగ్స్ జట్టు ఓటమి పాలైంది. హైదరాబాద్‌లోని ఏఎమ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నాగ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

Prabhas Roaring Rebels

టీఎఫ్ఐ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రోరింగ్ రెబల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. స్కోరు 2 పరుగులు ఉండగానే ఓపెనర్ ప్రకాశ్ రెడ్డి డకౌట్ అయ్యారు. ఆ తర్వాత అజారుద్దీన్ 4 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన సాయినాథ్ 9 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

అయితే ఓపెనర్ ఇంతియాజ్ సుడిగాలి ఇన్సింగ్ ఆడాడు. ఓ వైపు వికెట్లు టపటపా రాలుతున్నా పరుగుల వరద పారించాడు. ఆయనక తోగుగా అంకిత్ కూడా ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇంతియాజ్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు.

రోరింగ్ రెబల్స్ జట్టులో అకింత్ 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 44 పరుగులు, లక్కీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. నాగ్ కింగ్ టీమ్‌లో చైతన్య 3 వికెట్లు పడగొట్టాడు.

247 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాగ్ కింగ్స్ జట్టు చేతులు ఎత్తేసింది. ఓపెనర్లు తాషిన్, వినయ్ ఇద్దరు డకౌట్ అయ్యారు. దాంతో జట్టు పరుగుల వేగం మందగించింది. పాషా 25 పరుగులు, మధు 33 పరుగులు, సయ్యద్ 13 పరుగుల, రాజేష్ 12, సూర్య తేజ 12 పరుగులు చేశాడు. నాగ్ కింగ్స్ జట్టు 14.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది.

రోరింగ్ రెబల్స్ జట్టులో సాయినాథ్ 3 వికెట్లు, శివాజీ 2, అబిద్ 2 వికెట్లు, అక్షయ్ 1 వికెట్, ప్రవీణ్, నవీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంతియాజ్‌ను అభినందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X