TFI Fans Cricket League రాంచరణ్ గేమ్ ఛేంజర్స్ విజృంభణ.. వెంకీ వారియర్స్ ఓటమి
తెలుగు సినీ హీరోల అభిమానులు తొలిసారి జట్టుగా ఏర్పడి నిర్వహిస్తున్న టోర్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రికెట్ లీగ్. ఈ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం రాంచరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్స్, వెంకటేష్ అభిమానుల జట్టు వెంకీ వారియర్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా జరిగింది. ఈ మ్యాచ్‌లో వెంకీ వారియర్స్ జట్టుపై గేమ్ ఛేంజర్స్ జట్టు 42 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. దాంతో వెంకీ వారియర్స్ జట్టు బౌలింగ్ చేపట్టింది. గేమ్ ఛేంజర్స్ జట్టులో ఓపెనర్లు సాయిచరణ్, పృథ్వీ సమోచితంగా ఆడి తొలి వికెట్‌కు 56 పరుగుల జోడించారు. సాయిచరణ్ జట్టు 25 పరుగులు, పృథ్వీ 29 పరుగులు సాధించారు.
ఆ తర్వాత సుభాష్, అహితేజ ధాటిగా ఆడారు. సుభాష్ 49 పరుగుల వద్ద, అహితేజ 30 పరుగుల వద్ద అవుటయ్యారు. కల్యాణ్, అభిలాష్ తలా 10 పరుగులు చేశారు. దాతో ఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
ఆ తర్వాత 183 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టి వెంకీ వారియర్స్ జట్టులో ఓపెనర్ ప్రదీప్ 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత చందూ 23 పరుగులు, బేరి 19 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేసింది.
గేమ్ ఛేంజర్ జట్టులో అరుద్ర, సాయిచరణ్, అభిలాష్, సృజన్, అజర్, అహితేజ, కల్యాణ్ తలా ఒకటి తీశారు. వెంకీ వారియర్స్ జట్టులో నరేష్ 3 వికెట్లు పడగొట్టారు. రోహిత్, ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











