సైకిల్‌పై విజయ్.. నెటిజన్ల రియాక్షన్ వైరల్.. అసలు కారణం అదే అంటూ దళపతి
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కూడా దాని వేడి మాత్రం దేశ వ్యాప్తంగా తాకుతోంది. నేటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విషయం దేశం మొత్తం ట్రెండ్ అవుతోంది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు ఎన్నికలు జరిగాయి. ఇందులో తమిళ నాడులో జరిగిన పోలింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తారల ఓటింగ్‌తో సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.
నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

కదిలిన కోలీవుడ్..
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, ఎంఎన్‌ఎమ్, బీజేపీ ఇలా ఎన్నో పార్టీల మధ్య పోరు నడుస్తోంది. మరీ ముఖ్యంగా డీఎంకే ఓ వైపు అన్నాడీఎంకే, బీజేపీ ఇలా అంతా మరో వైపు నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కమల్ హాసన్, రాధిక, శరత్ కుమార్ వంటి సినీ తారలు కూడా ప్రభావం చూపేలా ఉన్నారు.

తారల ఓట్లు..
మామూలుగా అయితే తారలంతా బిజీగా ఉండటం మూలాన ఓటు హక్కును వినియోగించుకోరు. కానీ ఈ మధ్య పరిస్థితి మారుతోంది. సెలెబ్రిటీలందరూ ఇళ్లు కదిలి వస్తున్నారు. ఓట్లు వేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోండని జనాలకు సందేశాలను ఇస్తున్నారు. అలా నేడు కోలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.

స్టార్ హీరోలు సైతం..
స్టార్ హీరోలైన దళపతి విజయ్, తలా అజిత్, సూర్య, కార్తీ ఇలా అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్య తన ఫ్యామిలీతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేశాడు. ఇక అజిత్ తన సతీమణితో సహా వచ్చి ఓటు వేశాడు. అయితే విజయ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు.

అలా అనుకున్నారు..
పెరిగిన పెట్రోల్, డీజిల్‌కు వ్యతిరేకంగా విజయ్ సైకిల్ మీద వచ్చి ఓటు వేశాడంటూ మొదటగా ప్రచారం జరిగింది. దీంతో విజయ్ మీద భిన్నాభిప్రాయాలు, ట్రోల్స్ మొదలయ్యాయి. రెండు రకాలుగా చీలి విజయ్ మీద కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

విజయ్ క్లారిటీ..
దళపతి విజయ్ తన టీం ద్వారా ఈ ఆరోపణలకు చెక్ పెట్టేశాడు. పోలింగ్ బూత్ దగ్గరే ఉండటం. అక్కడ పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, అందుకే ఇలా సైకిల్ మీద వెళ్లానని దాని వెనుక మరే ఉద్దేశ్యం, కారణం లేదని క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











