twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: మహేష్ బాబును అందుకే తీసుకోలేదు, మతం రంగు పులమొద్దు: రాజమౌళి

    |

    'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు గురించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రాజమౌళి తాను ఊహించని ప్రశ్నలు ఎదుర్కొన్నారు. కొందరు ఈ సినిమాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కోణం ఆపాదించి ప్రశ్నలు వేయడం ఆశ్చర్య పరిచింది.

    'అల్లూరి సీతారామరాజు' సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేశారు కాబట్టి... ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి పాత్రకు మహేష్ బాబును ఎందుకు తీసుకోలేదు? ఫ్యాన్స్‌కు ఏం సమాధానం చెబుతారు? అంటూ మరికొందరు ప్రశ్నించారు. వీటికి రాజమౌళి ఓపిగా సమాధానం ఇచ్చారు.

    మతాలకు ముడి పెట్టొదండీ

    మతాలకు ముడి పెట్టొదండీ

    అల్లూరి సీతారామరాజు అపుడు క్రిస్టియన్ పాలనలో ఉన్నారు, కొమురం భీం ముస్లిం రాజు పాలనలో ఉన్నారు.. ఈ ఇద్దరు హిందువులు కదా... మీ సినిమా కమ్యూనల్ వివాదానికి కారణం అవుతుందా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ... మతాలకు ముడి పెట్టొదండీ. నేను వాటి గురించి అసలు ఆలోచించను. మనం సిన్సియర్‌గా కథ చెబుతున్నామా? లేదా? అనేదే ముఖ్యమని తెలిపారు. ఎన్టీఆర్ కల్పించుకుని... మతం, కులం లాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి. వారికి లేవు. మన ఆలోచనలు వారిపై రుద్దేస్తున్నామని వ్యాఖ్యానించారు.

    ‘ఆర్ఆర్ఆర్' ఒకే పార్ట్

    ‘ఆర్ఆర్ఆర్' ఒకే పార్ట్

    ‘ఆర్ఆర్ఆర్' అనేది సింగిల్ సినిమాగానే వస్తోంది. బాహుబలి కథ పెద్దది కాబట్టి రెండు భాగాలుగా తీయాల్సి వచ్చింది. ఒకటి అయిన తర్వాత భలే ఉంది కదా అని రెండోది తీయలేదు. లాంగ్ కథ కాబట్టి రెండు భాగాలుగా చేయాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ కథ ఒకే సినిమాలో పట్టే కథ అని రాజమౌళి స్పష్టం చేశారు.

    ప్రాంతాలను బట్టి కాదు, సత్తా బట్టే ప్రాతల ఎంపిక

    ప్రాంతాలను బట్టి కాదు, సత్తా బట్టే ప్రాతల ఎంపిక

    అజయ్ దేవగన్‌ను తీసుకుంటున్నాం కదా అని ఆయనది విలన్ పాత్ర అని అనుకోవద్దు. కథ కాలం ఎక్కువగా నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి అక్కడి వారిని తీసుకోవడం జరిగింది. కొంత మంది నార్త్, కొంత మంది సౌత్ పెట్టుకుందామనే ఆలోచన చేయలేదు, చేయను కూడా. ఆ పాత్రకు ఎవరైతే బావుంటారు, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే సత్తా ఎవరికి ఉంది? అనేదే చూస్తాం. మాకు వారితో ఉన్న రిలేషన్, డేట్స్, రెమ్యూనరేషన్ ఇవన్నీ బేరీజు వేసుకుని ఎవరు సూటవుతారో వారిని ఎంచుకుంటామని రాజమౌళి తెలిపారు.

    ఇద్దరిలో ఎవరు నో చెప్పినా ‘ఆర్ఆర్ఆర్' ఉండేది కాదు

    ఇద్దరిలో ఎవరు నో చెప్పినా ‘ఆర్ఆర్ఆర్' ఉండేది కాదు

    ‘ఆర్ఆర్ఆర్' సినిమా చేయడానికి ఇటు తారక్, అటు చరణ్ ఎవరు నో చెప్పినా నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. ఈ కథలో వారు తప్ప వేరే వారిని నేను ఊహించుకోలేను. ఇద్దరిలో ఎవరు ఒప్పుకోకున్నా వేరే కథ చేసేవాడిని.

    మహేష్ బాబును అందుకే తీసుకోలేదు

    మహేష్ బాబును అందుకే తీసుకోలేదు

    అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణగారు చేశారు. ఆ క్యారెక్టర్ స్పూర్తితో సినిమా చేసినపుడు కృష్ణగారి కొడుకు మహేష్ బాబును పెట్టాలనే ఆలోచన రాలేదా? ఫ్యూచర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ దీని గురించి ప్రశ్నించే అవకాశం లేదంటారా? అనే ప్రశ్నకు రాజమౌళి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

    ‘‘గతంలో ఓ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు? అని అడుగుతుంటే... మహేష్ బాబును ఏ పాత్రలో చూడాలని అనుకుంటున్నారు? అని వారిని సరదాగా ఎదురు ప్రశ్నించాను. అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటన్నారా? అని అడిగినపుడు అంతగా రెస్పాన్స్ రాలేదు. జేమ్స్ బాండ్‌గా చూడాలనుకుంటున్నారా? అంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇదే.'' అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

    English summary
    "Fans not interested to watch Mahesh Babu in Alluri role." That's why Rajamouli does not choose Mahesh Babu for RRR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X