twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018: ఈ ఏడాది రేటింగ్స్ పరంగా బి టౌన్ మూవీస్ ఇవే!

    |

    2018 సంవత్సరం హిందీ సినిమా పరిశ్రమకు ఎన్నో తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అందులో ప్రేక్షుకులు మెచ్చిన చిత్రాలు కొన్ని మాత్రమే.

    సినిమా ఎంత బావుంది? ఏమేరకు ప్రేక్షకులకు నచ్చింది? అనేది రేటింగ్స్ ద్వారా బేరీజు వేస్తుంటారు. ఇంటర్నేషనల్ మూవీ డాటాబేస్ (ఐఎండిబి) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాల సమాచారంతో పాటు ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించి రేటింగ్ ఇవ్వడం తెలిసిందే.

    అందరి కంటే కలెక్షన్లు ఎక్కువ వచ్చినా... రేటింగ్ పరంగా వెనకబడిన సినిమాలూ ఉన్నాయి. అలాగే ప్రేక్షకుల అభిమానం చూరగొన్నా కలెక్షన్లు పెద్దగా సాధించని సినిమాలు ఉన్నాయి. మరి 2018లో IMDB హయ్యెస్ట్ రేటింగ్ సాధించిన టాప్ 10లో నిలిచిన హిందీ చిత్రాలు ఏమిటో ఓ లుక్కేద్దాం.

    అంధాదున్

    అంధాదున్

    శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అంధాదున్' ఐఎండిబి రేటింగ్ పరంగా నెం.1 స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి అత్యధికం 9/`10 రేటింగ్ లభించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 96.5 మార్కులు పడ్డాయి.

    బడాయి హో

    బడాయి హో

    అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా నటించిన ‘బడాయి హో' చిత్రానికి ఐఎండిబి నుంచి 8.2/10 రేటింగ్ లభించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 93.6 మార్కులు పడ్డాయి.

    స్త్రీ

    స్త్రీ

    శ్రద్ద్ కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడం మాత్రమే కాదు... ఐఎండిబి నుంచి 8.1/10 రేటింగ్ సాధించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 91.2 మార్కులు పడ్డాయి.

    ప్యాడ్ మ్యాన్

    ప్యాడ్ మ్యాన్

    ఆర్ బాల్కీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో సానిటరీ నాప్కిన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తు... వాటి వాడకంపై ఉన్న అపోహను తొలగించేందుకు రూపొందించిన ‘ప్యాడ్ మ్యాన్' చిత్రానికి ఐఎండిబి నుంచి 8.1 రేటింగ్ అభించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 88.9 మార్కులు పడ్డాయి.

    పరమాణు

    పరమాణు

    అభిషేక్ శర్మ దర్శకత్వంలో డయానా పెంటీ, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పరమాను చిత్రానికి ఐఎండిబి నుంచి 7.9/10 రేటింగ లభించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 87మార్కులు పడ్డాయి.

    రాజీ

    రాజీ

    మేఘనా గుల్జార్ దర్శకత్వంలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజీ' చిత్రానికి ఐఎండిబి నుంచి 7.8/10 రేటింగ్ లభించింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 87 మార్కులు పడ్డాయి.

    మాంటో

    మాంటో

    నందితా దాస్ దర్శకత్వంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, తాహిర్ రాజ్ భాసిన్, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మాంటో చిత్రానికి ఐఎండిబి నుంచి ఐఎండిబి నుంచి 7.7/10 దక్కింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 86.4 మార్కులు పడ్డాయి.

    సంజు

    సంజు

    రాజ్ కుమార్ హిరానీ దర్వకత్వంలో సంజయ్ దత్ జీవితం ఆధారంగా.... రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంజు' చిత్రానికి ఐఎండిబి నుంచి 8.1/10 రేటింగ్ దక్కింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 86 మార్కులు మాత్రమే పడ్డాయి.

     కారావాన్

    కారావాన్

    ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కారావాన్' చిత్రానికి ఐఎండిబి రేటింగ్ 7.6/10 దక్కింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 85.6 మార్కులు పడ్డాయి.

    లైలా మజ్ను

    లైలా మజ్ను

    సాజిద్ అలీ దర్శకత్వంలో అవినాష్ తివారీ, తృప్తి దిమ్రి, సుమిత్ కౌల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లైలా మజ్ను' చిత్రానికి ఐఎండిబి నుంచి 7.9 రేటింగ్ దక్కింది. ఐఎండిబి సంస్థ నుంచి ఈ చిత్రానికి 85.5మార్కులు పడ్డాయి.

    English summary
    The IMDB highest-Rating Bollywood films 2018 list, by world wide and india wide Audiance voting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X