సమంత చాలా కాస్ట్లీ గురూ! కేవలం ఆ ఒక్క దానికోసమే ఎంత వెచ్చించిందో తెలుసా..?
సాధారణంగా సెలెబ్రిటీలన్నాక కాస్ట్లీ దుస్తులు, భారీ ధర కాస్ట్యూమ్స్ ధరించడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీల కాస్ట్యూమ్స్‌కి సంబంధించి వార్తలు రావడం, కళ్ళు చెదిరేలా ఉండే వాటి ధరలు బయటకు తెలియడంతో షాక్ అవుతుంటారు జనం. తాజాగా అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి పోతే..

అక్కినేని ఫ్యామిలీ.. జాలీ జాలీ షికారు
గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాగార్జున సహా నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్, అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది సమంత.

తెలుగు సినిమా హీరోయిన్లకు ఫ్యాషన్ ఐకాన్
పెళ్లి తర్వాత తెలుగు సినిమా హీరోయిన్లకు ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది సమంత. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తూ తన గ్లామర్‌తో మతి పోగొడుతూ వస్తున్న ఈ భామ.. తాజాగా స్పెయిన్‌లో వన్ షోల్డర్ షిమ్మర్ పింక్ కలర్ డ్రస్‌లో కనిపించి వావ్ అనిపించింది. ఈ డ్రెస్‌లో దిగిన పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

ఆ ఒక్క దానికోసమే ఎంత వెచ్చించిందంటే..
అయితే వన్ షోల్డర్ షిమ్మర్ పింక్ కలర్ డ్రస్ ఖరీదు ఎంతో తెలిసి షాక్ అవుతున్నారు జనం. ఈ డ్రెస్ ధర సుమారుగా 2 లక్షలు ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సమంత డ్రెస్ సంగతులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఒక్క డ్రెస్ కోసమే సమంత ఇంత మొత్తం వెచ్చించిందంటే.. ఆమె చాలా కాస్లీ బాబోయ్! అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

వెబ్ సిరీస్‌లో సమంత
ఇటీవలే ఓ బేబీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందని తెలుస్తోంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందని సమాచారం. ఏదేమైనా సమంత, తన రూటే సపరేటు అన్నట్లుగా సాగిపోతూ వావ్ అనిపిస్తోంది కదూ!.


Click it and Unblock the Notifications











