రాజమౌళి కారణంగా దర్శకులను ఇబ్బంది పెడుతున్న హీరోలు.. భయంతో నిర్మాతలు?
పాజిటివ్ అనే కాకుండా నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఎక్కడైనా ఉంటాయి. ఒక మంచి జరుగుతుంది అంటే తెలియకుండానే దాని వెనుక కొన్ని మైనస్ లు ఉండవచ్చు. సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు ఏ స్థాయిలో వాల్యూ ఇస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ తో పాటు చాలా విషయాల్లో డోస్ పెరిగింది. ఒక సినిమా హిట్టయితే ఆ ఎఫెక్ట్ తరువాత సినిమాపై కూడా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే.

RRR డోస్..
RRR రిలీజ్ తరువాత టాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన రాజమౌళి ఇప్పుడు RRRతో ఆ డోస్ మరింత పెంచుతున్నారు. కాన్సెప్ట్ నచ్చితే నేషనల్ వైడ్ గా సినిమాలను రిలీజ్ చేయడానికి మిగతా హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

మిగతా దర్శకులపై ఎఫెక్ట్..
రాజమౌళి పాన్ ఇండియా సినిమాలను తీయడం బాగానే అలవాటు చేసుకున్నారు. దీంతో కొంతమంది స్టార్ హీరోలు కూడా వారి క్రేజ్ ని మరీంత పెంచుకోవాలని మిగతా దర్శకులను ఇబ్బంది పెడుతున్నారు. కథలను చెప్పడానికి వస్తున్న దర్శకులకు పాన్ ఇండియా సినిమా చేద్దామని అంటున్నారట. దీంతో దర్శకులు స్క్రిప్ట్ పై మరికొన్ని నెలల పాటు కూర్చొని మార్పులు చేస్తున్నారట.

రాజమౌళి చేసిన పనికి..
రాజమౌళి సినిమా చేద్దామని కమిట్ అయితే చాలు హీరోలు చాలా మారిపోతున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకె మొగ్గు చూపుతున్నారు. ఇక నెక్స్ట్ రాజమౌళి మహేష్ తో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా తరువాత కూడా మహేష్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా కథలవైపే మొగ్గు చూపుతున్నారట. అదే బాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

నిర్మాతల్లో భయం..
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా అంటే ఇప్పుడు నిర్మాతల్లో ఒక భయం మొదలైంది. వారి డేట్స్ సంగతి పక్కన పెడితే.. హీరోల పాన్ ఇండియా ప్లాన్స్ కి ఒక్కో సినిమాకు మినిమామ్ 150కోట్లయినా ఖర్చు చేయాల్సిందే. మొన్నటివరకు 50 నుంచి 70 కోట్లల్లో నడిచిన వ్యాపారం ఇప్పుడు 150కోట్లను దాటేసింది. మేకింగ్ ని బట్టి 200కోట్లు కూడా దాటవచ్చు. ఈ విధంగా మన హీరోల పాన్ ఇండియా ప్లాన్స్ కారణంగా టాలీవుడ్ లో ఊహించని మార్పులే చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











