ప్రేమ, విలాసం, రాజసం ఉట్టిపడేలా: గ్లోబల్ లగ్జరీ మ్యాప్‌పై ఇండియా ఘనతను చాటి చెప్పిన పెళ్లి
కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా పెళ్లిళ్లు, ప్రైవేట్ ఈవెంట్స్ చూశాం. కానీ 2024లో బ్రహ్మండంగా జరిగిన ఓ వివాహం ఆశ్చర్యంతో కనుబొమ్మలు ఎగిరేసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. కనీవినీ ఎరుగని విధంగా జరిగిన పెళ్లి సంబురాలు హాలీవుడ్ నుంచి పారిస్‌లోని రాజసౌధాన్ని కూడా తాకాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చం్ కలయిక కేవలం ఓ సెలబ్రేషన్ మాదిరిగా కాకుండా మోడరన్ ఇండియా సౌరభాన్ని, సంపద, క్రియేటివిటీని, ఇన్ల్ఫూయెన్స్, కల్చర్‌ను ప్రపంచానికి చాటి చెప్పింది.
ప్రపంచ పటంపై ఇండియా ప్రధాన వేదికగా.. విశ్వానికి కన్నుల పండువగా
దశాబ్దాల కాలంగా పారిస్ ఫ్యాషన్ షో, మిలాన్ డిజైన్, న్యూయార్క్ సెలబ్రిటీ లాంటి ఈవెంట్స్‌తో పాశ్చత్య దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. కానీ జూలై 12, 2024 రోజు మాత్రం ముంబై న్యూ మోనాకోగా, జామ్ నగర్ న్యూ సెయిం్ ట్రాపెజ్‌గా మారిపోయి ప్రపంచాన్ని మొత్తం తమవైపు తల తిప్పుకొనేలా చేసింది.

ఇండియాలో అంగరంగ వైభవంగా మాత్రమే ఈ కల్యాణం జరుగలేదు.. భారత్‌లోని సంస్కృతి, సంప్రదాయలను గ్లోబల్ గ్లామర్ లోకానికి చూపించేలా జరిగింది. హైటెక్ డ్రోన్స్ ద్వారా సంప్రదాయంగా హరతులు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యంతో గుసగుసలాడారు. కాలానికి అతీతంగా, శక్తిమంతంగా, వైభవంగా మోడరన్ ఇండియా ఇలా ఉంటుందనే సంకేతాన్ని పంపించింది.
ప్రపంచ వేదికగా భారత్ మారిన వేళ
ఇంతకుముందెన్నడూ జరగని విధంగా నిర్వహించిన ఇండియన్ సెలబ్రేషన్‌కు ప్రపంచ దిగ్గజాలు, గ్లోబల్ ఐకాన్స్‌ను కేవలం డిప్లమసీ కోసమో, సినిమా కోసమో ఆహ్వానించలేదు. వారిని కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమంలో భాగం చేశారు.
ప్రీ వెడ్డింగ్ వేడుకలో బార్బడియన్ సూపర్ స్టార్ రిహాన్నా తన గానామృతాన్ని పంచారు.
భారతీయ సంప్రదాయాల్లో మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, కార్లీ క్లాస్ తదితరులు భాగమయ్యారు.
కిమ్, ఖోల్ కర్దాషియాన్ కేవలం హాజరు మాత్రమే కాలేదు. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా రూపొందించిన లహెంగాలు ధరించి ఆకర్షణగా నిలిచారు.
హాలీవుడ్ ప్రొడ్యూసర్స్, సిలికాన్ వ్యాలీ టైకూన్స్, రాయల్ ఫ్యామిలీస్ ఈ కల్యాణ వేదికలో మెరిసారు. వారిని ఇండియా కేవలం అతిథులుగా ఆహ్వానించలేదు. గ్లోబల్ స్టేజ్‌పై వారికి గౌరవ వందనం సమర్పించింది.

ప్రీ వెడ్డింగ్‌తో రాయల్ హిస్టరీ
ఇప్పటి వరకు మీకు తెలిసిన ప్రీ వెడ్డింగ్ వేడుకలను మరిచిపోండి. అంబానీ కుటుంబం ఈ కింది విధంగా చరిత్రను తిరగరాసింది.
భూమ్యాకాశాలను కలిపే విధంగా జామ్ నగర్‌లో ప్యాలెస్ థీమ్‌తో ఏర్పాటు చేసిన పెళ్లి వేదికలో పవిత్రంగా పెళ్లి ఆచారాలు జరగడం.
ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు లగ్జరీ క్రూయిజ్ ఏర్పాటు, మీడియాకు ప్రవేశం లేకుండా, ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా ప్రతీ గ్లోబల్ మీడియా సంస్థలో సెలబ్రిటీల హాజరు గురించి గొప్పగా పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి.
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఆకర్షణీయంగా దుస్తులు డిజైన్ చేసి తమ పవర్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు.

ఫ్యాషన్ అంటే పారిస్ కాదు.. ముంబై అనేలా..
ఒక్క వారాంతం గ్లోబల్ ఫ్యాషన్ వీక్స్ మసకబారేలా భారతీయ సంప్రదాయ దుస్తులు, అలంకరణలు
రాధిక అందంగా ముస్తాబై పువ్వులా మారిపోయారు
ఇషా అంబానీ.. డైమండ్స్, హెరిటేజ్ టెక్స్‌టైల్స్ ధరించి తమ లెగసీని చాటి చెప్పింది.
గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్స్ బందానీస్, సిల్క్, జార్దోసి ఎంబ్రాయిడరీతో చేసిన వస్త్రాలు గౌరవానికి సూచికగా నిలిచాయి.
గ్లోబల్ గ్లామర్‌తో మమేకమైన బాలీవుడ్ .. ప్రతీ ఒక్కరు డ్యాన్సులతో హంగామా
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ ఇలా సెలబ్రిటీలు ఒక్కరేంటి? సిలికాన్ వ్యాలీస్ సీఈవోలు, ఇంటర్నేషనల్ పాప్ ఐకాన్స్ ఈ వేడుకలో భాగమయ్యారు.
క్రికెటర్లు, హాలీవుడ్ స్టార్స్, రాయల్టీ, బిలియనీర్లు ఈ బరాత్‌లో నృత్యాలు చేసి ఈ వేడుకను ఓ పెళ్లి కార్యక్రమంలా కాకుండా కదలుతున్న చరిత్రకు చిహ్నంగా మార్చారు.

గ్లోబల్ వెడ్డింగ్ స్టాండర్డ్స్‌కు మారుపేరుగా కళా సౌందర్యం
కాశీని స్పూర్తిగా తీసుకొని ప్రతీ వేదిక కూడా ఓ కొత్త కథను చెప్పే విధంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పంచేలా లెజెండరీ డిజైనర్ ప్రిస్టన్ బెయిలీ తన సృజనాత్మకతతో కేవలం ఓ డెకరేషన్‌గా కాకుండా సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేశారు.
ఇండియా అంటే కేవలం బ్యూటీఫుల్ మాత్రమే కాదు.. ఓ విజనరీ అనే విధంగా ప్రపంచం మొత్తం ఆమోదించాయి. ది అంబానీ ఈస్తటీక్ అంటూ ఇప్పటికీ మిలాన్, టోక్యో డిజైన్ బ్లాగ్స్ రెఫరెన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు.
పురాణ కాలంలో ఫీల్‌ను తలపించేలా రాయల్ ఎంట్రీ
పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ గానం, బాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు ఉన్న కళాకారుల పెళ్లి మేళతాళాల మధ్య రాధిక మర్చంట్ నడిచి రాకుండా నెమలి రూపంలో అలంకరించిన తేలియాడుతున్న నావలో కల్యాణ వేదికను చేరుకొన్నారు.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన సవ్యసాచి షేర్వానీ ధరించి అనంత్ అంబానీ రాజసత్వంతో ఇచ్చిన ఎంట్రీ కేవలం స్టైల్‌ను మాత్రమే చూపించకుండా మోడరన్ మహారాజు దర్పాన్ని చాటి చెప్పింది. అలాగే ఇండియా వారసత్వానికి సంకేతంగా నిలిచింది.
ఏడాది తర్వాత కూడా ప్రపంచం గొప్పగా మాట్లాడుకొనేలా వివాహ వేడుక
బాలీవుడ్‌లో ఏ సినిమా ఈవెంట్, ఫ్యాషన్ వీక్, డిప్లోమాటిక్ ఈవెంట్ చేయని విధంగా అనంత్, రాధిక వెడ్డింగ్ 2024లో జరిగింది. తూర్పు పడమర కలిసే విధంగా, అధునికత, సంప్రదాయం, ఐశ్వర్యం ఉట్టిపడేలా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ శతాబ్దంలో అంగరంగ వైభవంగా, అద్భుతంగా జరిగిన వివాహం మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తం అతిథులుగా కాకుండా ఆరాధనతో చూసేలా ఈ పెళ్లి సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి గుర్తు చేసింది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కేవలం ఓ వివాహ సంబురంగా కాకుండా శతాబ్దంలో ఒకే ఒకసారి జరిగే గ్రాండ్ మూమెంట్‌గా, ప్రపంచానికి 1000 ఏళ్లు గుర్తుండిపోయే సాక్ష్యంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











