వాళ్లు నా శత్రువులు అంటూ త్రివిక్రమ్ షాక్, ఇకపై ఎవరూ పిలవరేమో?

త్రివిక్రమ్ పేరు వినగానే అందరూ ఆయన్ను మాటల మాంత్రికుడు అనేస్తారు. అభిమానులు కూడా ఆయన రాసే డైలాగులు తెగ నచ్చేసి ఇలానే పిలుస్తుంటారు. మరికొందరేమో ఆయన్ను పంచ్ డైలాగుల కింగ్ అని సంభోదిస్తుంటారు. ఇవన్నీ నిజమే... ఒకప్పుడు రచయితగా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ అదిరిరిపోయే పంచ్‌లు, ప్రాసలు... అద్భుతమైన డైలాగులుతో పాపులర్ అయ్యారు.

అయితే ఇపుడు త్రివిక్రమ్‌కు 'మాటల మాంత్రికుడు' అని పిలిపించుకోవడం ఇష్టం లేదని అంటున్నారు. అలా పిలిచే వారిపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమాన్నారో వింటే ఇకపై ఎవరూ అలా పిలవరేమో?

 నాకు అస్సలు నచ్చదు

నాకు అస్సలు నచ్చదు

"నేను పంచ్‌లు బాగా రాస్తానని కొంతమంది అంటారు. మరి కొంతమంది 'మాటల మాంత్రికుడు' అంటారు. ఇలా అనిపించుకోవడం .. పిలిపించుకోవడం నాకు నచ్చదు అంటూ త్రివిక్రమ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Recommended Video

Trivikram's Next Movie Is Produced By Kalyan Ram
 వాళ్లను నా శ్రతువులుగా భావిస్తాను

వాళ్లను నా శ్రతువులుగా భావిస్తాను

నన్ను మాటల మాంత్రికుడు, పంచ్ డైలాగ్స్ కింగ్ అని పిలిచేవాళ్లపై నాకు కోపం వస్తుంది, అలా అనే వారిని నా శత్రువులుగా భావిస్తుంటాను. అసలు నాకు పంచ్ డైలాగ్స్ రాయడం తెలియదని త్రివిక్రమ్ స్పష్టం చేశారు.

అలాంటి అలవాటు లేదు

అలాంటి అలవాటు లేదు

నాకు పంచ్ లైన్స్ రాయడం నిజంగా తెలియదు. పది మందితో కూర్చుని డిస్క్రస్ చేస్తూ ఆ సిచ్యువేషన్‌కు ఎలాంటి పంచ్ బావుంటుంది అని చర్చించే అలవాటు కూడా లేదు. నా లైన్స్ స్పాంటేనియస్లీగా ఉండేలా చూసుకుంటాను.... అని త్రివిక్రమ్ తెలిపారు.

ఆ సినిమా నుంచే మానేశాను

ఆ సినిమా నుంచే మానేశాను

నేను ప్రాస డైలాగులు రాస్తానని కొందరంటారు. వాటిని నువ్వే కావలి సినిమా తర్వాత నుంచి రాయడం మానేశాను అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. అయితే కొందరు రైటర్లు ప్రాస డైలాగులు రాయడం గమనించాను అని తెలిపారు.

అవే రాస్తున్నా, ఎవరూ కాపీ కొట్టలేరు

అవే రాస్తున్నా, ఎవరూ కాపీ కొట్టలేరు

ఇపుడు తీస్తున్న సినిమాల్లో నా ఆలోచనా విధానంలో నుంచి పుట్టిన స్టేట్‌మెంట్స్‌ను డైలాగ్స్‌గా రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల వాటిని ఎవరూ అనుసరించలేరు, నా స్టైల్ కాపీ కొట్టడం కూడా సాధ్యం అవుతుంది అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు.

అరవింద సమేత బంపర్ హిట్

అరవింద సమేత బంపర్ హిట్

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటికే రూ. 150 కోట్లుకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్లో అతిపెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X