CCL2024 Final టాప్ టీమ్స్‌ను మట్టికరిపించిన కర్ణాటక బుల్డోజర్స్.. కిచ్చ సుదీప్ జట్టు ఫైనల్‌కు ఎలా చేరిందంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 పదో సీజన్ గత నెల రోజులుగా ఘనంగా సాగింది. ఫిబ్రవరి 23వ తేదీన షార్జాలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. అంతకు ముందు ముంబైలో సీసీఎల్ క్యాలెండర్, షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్ జట్ల మధ్య షార్జాలో జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ను మార్చి 17వ తేదీన జరిపే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు ఎలా చేరిందంటే?
* సీసీఎల్ 10వ సీజన్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ముంబై హీరోస్‌తో ఆడారు. ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కిచ్చ సుదీప్ కెప్టెన్సీలోని జట్టు కేరళ జట్టుపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.

* ఈ టోర్నీలో రెండో మ్యాచ్‌ను బెంగాల్ టైగర్స్ జట్టును కర్ణాటక బుల్డోజర్స్ జట్టు ఎదుర్కొన్నది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నెషనల్ క్రికెట్ స్టేడియంలో మార్చి 2వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
* సీసీఎల్ 10వ సీజన్‌లో మూడో మ్యాచ్‌ను హైదరాబాద్‌లో మార్చి 3వ తేదీన కర్ణాటక జట్టు ఆడింది. చెన్నై రైనోస్ జట్టును ఎదుర్కొన్న ఈ టీమ్ 67 పరుగుల భారీ తేడాతో తిరుగులేని గెలుపును సాధించింది.
* వరుస విజయాలతో దూసుకెళ్తున్న కర్నాటక బుల్డోజర్స్ జట్టుకు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు విజయం సాధించింది. తిరువనంతపురం జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో కిచ్చ సుదీప్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.

* సీసీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలిచిన కర్నాటక బుల్డోజర్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌ను బెంగాల్ టైగర్స్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై 8వ వికెట్ల తేడాతో గెలుపు సాధించింది.
* ఇలా సీసీఎల్ 10 సీజన్‌లో వరుస విజయాలతో కర్ణాటక జట్టు తన అధిక్యాన్ని చాటుకొన్నది. ఈ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోను ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకొన్నది. దాంతో సులభంగా ఫైనల్‌కు చేరుకొన్నది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టుతో తలపడనున్నది.


Click it and Unblock the Notifications











