ఐపీఎల్, వరల్డ్ కప్‌లో ఫిల్మ్ స్టార్ష్ ఎందుకు డ్యాన్స్ చేస్తారో తెలుసా?
సినీ, క్రికెట్ ప్రపంచానికి మధ్య ఎన్నో దశాబ్దాల నాటి బంధం ఉంది. అయితే ఐపీఎల్‌లో బాలీవుడ్, హాలీవుడ్ తారలు ఎందుకు పర్ఫార్మెన్స్ ఇస్తారనే ప్రశ్న చాలా మందిలో తలెత్తే ఉంటుంది. మరి ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ లాంటి పోటీలల్లో స్టార్స్ ఎందుకు ఇలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనే విషయంపై ఇప్పుడు లుక్కేద్దాం.
ఐపీఎల్ గత 17 ఏళ్లుగా క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన లీగ్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభం నుండి సినీ తారలకు దానితో మంచి సంబంధం ఉంది. ఐపీఎల్‌లో కొంతమంది స్టార్లు జట్లను కొనుగోలు చేయగా, గత కొన్ని సంవత్సరాల్లో చాలా మంది స్టార్లు ఐపిఎల్ ప్రారంభ, ముగింపు వేడుకలల్లో మెరిసి కొత్త కళను తీసుకొచ్చారు. ప్రేక్షకులు ప్రతి సంవత్సరం ఐపీఎల్ ప్రారంభ వేసుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా టీ20 సిరీస్‌ను 2008లో లలిత్ మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇందులో భారత ఆటగాళ్లకే కాదు అంతర్జాతీయ క్రికెటర్లకు కూడా సువర్ణావకాశం దక్కుతుంది. 2008 నుండి ఐపిఎల్‌తో బాలీవుడ్, హాలీవుడ్‌లకు కూడా అవినాభావ సంబంధం ఉంది.
2008 సంవత్సరంలో ఫస్ట్ టైమ్ సల్మాన్ ఖాన్ క్రికెట్ వేదికపై పర్ఫార్మెన్స్ ఇచ్చి ఐపీఎల్‌ను కలర్‌ఫుల్‌గా ప్రారంభించాడు. సల్మాన్ తన పాపులర్ పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అప్పట్లో సల్మాన్ పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోయారు. అప్పటి క్రికెట్ ప్రారంభ వేడుకల్లో సెలబ్రిటీల పర్ఫార్మెన్స్ అనేది అది ఆనవాయితీగా వస్తోంది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి స్టార్‌లకు కోట్లలో డబ్బులు చెల్లిస్తుంది. ప్రారంభ, ముగింపు వేడుకలలో ప్రదర్శన ఇవ్వడానికి బాలీవుడ్ తారలు సుమారు రూ.3 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఒకవైపు ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూనే మరోవైపు ఐపీఎల్‌లో కూడా ప్రయోజనం అందుకుంటారు.

సినిమా హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు స్టార్లు తరచూ ఐపీఎల్ లేదా టీ20 వరల్డ్ కప్ లాంటి వేడుకల్లోకి వస్తుంటారు. భారతదేశంతో పాటు విదేశాలలో కోట్లాది మంది ప్రజలు ఐపీఎల్ ను చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్లు తమ రాబోయే సినిమాలను ప్రమోట్ చేసుకుంటే వారి సినిమాలకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది.
బాలీవుడ్ తారలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలో ప్రదర్శనకు స్టార్స్ ను ఆహ్వానించడం వెనుక అత్యంత స్పష్టమైన కారణం ఏంటంటే వీలైనన్ని ఎక్కువ టిక్కెట్లను విక్రయించడమే.
స్టార్లను చూడవచ్చు అనే ఉద్దేశంతో ఐపీఎల్ మొదటి, చివరి మ్యాచ్ కోసం జనాలు భారీ సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. అలాగే మ్యాచ్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది. లైవ్ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకుంటారు. అలాగే ఇంట్లో నుండి మ్యాచ్‌లను చూసే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఐపీఎల్ ను ప్రసారం చేసే ఛానెల్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. అలా క్రికెట్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది అటు క్రికెట్ బోర్డుకు, ఇటు సెలబ్రిటీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











