ISPL విజేతగా టైగర్స్: మెగాస్టార్‌ టీమ్‌కు దేవర విలన్ జట్టు షాక్.. రామ్ చరణ్ టీమ్‌కు ఏ స్థానమంటే!

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే ఇండియాలో ఎన్నో రకాల ప్రీమియర్ లీగ్‌లు మొదలవుతున్నాయి. ఇలా ఇప్పటికే ప్రొఫెషనల్ క్రికెట్‌ బాగా అభివృద్ధి చెందింది. అయితే, స్ట్రీట్ క్రికెటర్లను కూడా ప్రోత్సహించేందుకు భారతదేశంలో మొట్టమొదటి సారిగా టెన్నిల్ బాల్ క్రికెట్‌ను పరిచయం చేశారు. 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌' (ISPL) పేరిట దీన్ని మొదలు పెట్టారు. సినిమా స్టార్లు ఈ జట్లకు ఓనర్లుగా ఉన్నారు. మరి ఈ టోర్నమెంట్‌లో విజేతగా ఎవరు నిలిచారు? రామ్ చరణ్ జట్టు ప్రదర్శన ఎలా ఉంది? మీరే చూసేయండి!

ఆరు జట్లతో మొదలైన ISPL
టెన్నిస్ బాల్‌తో పది ఓవర్ల పాటు జరిగే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌ (ISPL)లో మఝీ ముంబై, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు స్ట్రయికర్స్, చెన్నై సింగమ్స్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా, శ్రీనగర్‌ కే వీర్ జట్లు పోటీ పడబోతున్నాయి. మొత్తం ఈ లీగ్‌లో 19 మ్యాచ్‌లు జరిగేలా నిర్వహకులు ప్లాన్ చేశారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

Tigers of Kolkata Beat Majhi Mumbai By 10 wickets and Won ISPL-T10 Title

సినిమా స్టార్లే టీమ్ ఓనర్లుగా
ఐఎస్‌పీఎల్ మొదటి సీజన్‌లో పాల్గొన్న ఆరు జట్లకు బడా సినిమా స్టార్లు ఓనర్లుగా ఉన్నారు. అందులో మఝీ ముంబై జట్టును అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయగా.. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్‌ను రామ్ చరణ్, బెంగళూరు స్ట్రయికర్స్‌ను హృతిక్ రోషన్, చెన్నై సింగమ్స్‌ను సూర్య, టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను సైఫ్ అలీ ఖాన్, శ్రీనగర్‌ కే వీర్‌ను అక్షయ్ కుమార్ కొన్నారు.

ఫైనల్‌కు ముంబై, కోల్‌కతా
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌ (ISPL)లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయని ముందే చెప్పుకున్నాం. ఇందులో లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్ 4లో నిలిచిన మఝీ ముంబై, చెన్నై సింగమ్స్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా, శ్రీనగర్ కే వీర్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్‌లో ముంబై, రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి ఫైనల్‌లో అడుగు పెట్టాయి.

Tigers of Kolkata Beat Majhi Mumbai By 10 wickets and Won ISPL-T10 Title

ముంబైకు షాకిచ్చి విజేతగా
ఐఎస్‌పీఎల్ మొదటి సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో మఝీ ముంబై జట్టుతో టైగర్స్ ఆఫ్ కోల్‌కతా తలపడింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై పది ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 58 పరుగులే చేసింది. స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన కోల్‌కతా కేవలం 7.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా టార్గెట్ చేధించింది. తద్వారా టోర్నీ విజేతగా నిలిచింది.

వాళ్లకు కోటి.. వీళ్లకు యాభై
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌ (ISPL)లో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచిన టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీని అందించాడు. అలాగే, మొదటి స్థానంలో నిలిచినందుకు కోటి రూపాయల ప్రైజ్ మనీని కూడా కోల్‌కతా దక్కించుకుంది. ఇక, ఇందులో రన్నరప్స్‌గా నిలిచిన ముంబైకు రూ. 50 లక్షలు దక్కాయి.

Tigers of Kolkata Beat Majhi Mumbai By 10 wickets and Won ISPL-T10 Title

రామ్ చరణ్ టీమ్‌కు షాక్
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌‌లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ టీమ్ టోర్నీ మొత్తంలో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక దానిలోనే విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఈ మొదటి సీజన్‌ను నిరాశాజనకంగా ముగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X