twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌కు, రవితేజ, నానికి దిమ్మతిరిగే షాక్.. 2018లో డిజాస్టర్ల పరంపర

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2018 సంవత్సరం చేదు అనుభవాలనే మిగిల్చింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2018లో సుమారు 180 సినిమాలు రిలీజ్ కాగా, 15 శాతం సక్సెస్ రేట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాలు బొక్కా బోర్లాపడ్డాయి. నిర్మాతలు నిలువుదోపిడే శరణ్యమైంది. 2018లో భారీ డిజార్డర్స్‌గా పేరు తెచ్చుకొన్న సినిమాలు ఇవే..

    పవన్ కల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా

    పవన్ కల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా

    2018లో అతి పెద్ద ఫ్లాప్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాత‌వాసి. దాదాపు రూ.125 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి రికార్డులు తిరగరాసింది. కానీ విడుదల తర్వాత చూస్తే రూ.60 కోట్లు దాటలేకపోయింది. దాంతో భారతీయ సినిమా పరిశ్రమలో అతిపెద్ద ఫ్లాపులతో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత సినీ రంగానికి పవన్ ముఖం చాటేశాడు.

    నేలటికెట్టు, అఅఆ, టచ్ చేసి చూడు

    నేలటికెట్టు, అఅఆ, టచ్ చేసి చూడు

    ఇక ఈ సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చిన హీరోల్లో రవితేజ ఒకరు. ఆయన నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంథోని చిత్రాలు దారుణమైన పరాజయాలను మూటగట్టుకొన్నాయి. నేల టికెట్ చిత్రం రూ.15 కోట్లకుపైగానే నష్టాన్ని మిగిల్చింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంథోని చిత్రం బయ్యర్లకు రూ.16 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

    Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

    కృష్ణార్జున యుద్ధం, దేవదాసు

    కృష్ణార్జున యుద్ధం, దేవదాసు

    2015 నుంచి నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ ఏడాది వచ్చిన కృష్ణార్జున యుద్ధం నాని స్పీడ్‌కు బ్రేక్ వేసింది. 29 కోట్లు బిజినెస్ జరుగగా, కేవలం 14.50 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఆ తర్వాత వచ్చిన మల్టీస్టారర్ చిత్రం కూడా డిస్టిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిర్మాతగా మారి రూపొందించిన అ‌! చిత్రం ఊరటనిచ్చింది.

     బెల్లంకొండ శ్రీనుకు నిరాశే

    బెల్లంకొండ శ్రీనుకు నిరాశే

    బెల్లంకొండ శ్రీనివాస్‌కు 2018 కలిసి రాలేదు. విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొన్నా గానీ అదృష్టం తలుపు తట్టలేదు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన సాక్ష్యం చిత్రం 10 కోట్లు మాత్రమే వసూలు చేసి 14 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లను పంగనామం పెట్టేసింది. ఏడాది ముగింపులో వచ్చిన కవచం చిత్రం కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా సుమారు రూ.13 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని సమాచారం.

    Poll: ఉత్తమ తెలుగు దర్శకుడు 2018Poll: ఉత్తమ తెలుగు దర్శకుడు 2018

     నాగార్జున‌కు ఆఫీస‌ర్ దారణంగా

    నాగార్జున‌కు ఆఫీస‌ర్ దారణంగా

    2018 సంవత్సరం టాలీవుడ్ మన్మధుడు నాగార్జున‌కు భారీ నిరాశను మిగిల్చింది. శివ తర్వాత 25 ఏళ్లకు వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆఫీసర్ చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ఈ చిత్రం కేవలం రూ.కోటి షేర్ వసూలు చేయలేకపోవడంతో డిస్టిబ్యూటర్లకు మైండ్ బ్లాంక్ అయింది. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకొన్న దేవదాస్ కూడా నిరాశనే మిగిల్చింది.

    నాగచైతన్య స‌వ్య‌సాచి

    నాగచైతన్య స‌వ్య‌సాచి

    అక్కినేని నాగచైతన్య‌కు 2018 సంవత్సరం మిశ్రమ ఫలితాన్ని అందించింది. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు కెరీర్‌లోనే అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే చందు మొండెటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.11 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

    Poll: ఉత్తమ విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు 2018Poll: ఉత్తమ విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు 2018

    సాయిధరమ్ తేజ్‌కు ఫ్లాపుల పరంపర

    సాయిధరమ్ తేజ్‌కు ఫ్లాపుల పరంపర

    2018లో అతి దారుణమైన పరిస్థితి ఎదురైంది మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు. ఆయన నటించిన ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి. డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి.

     ఎనిమిదేళ్ల తర్వాత అల్లు అర్జున్‌కు

    ఎనిమిదేళ్ల తర్వాత అల్లు అర్జున్‌కు

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ విజయాల పరంపరకు 2018 బ్రేక్ వేసింది. 2010లో రూపొందిన వరుడు తర్వాత 2018లో దర్శకుడు వక్కంతం వంశీ మరో భారీ ఫ్లాప్ రుచిని చూపించాడు. తొలిసారి దర్శకత్వ బాధ్యతలను చేపట్టి రూపొందించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా దారుణంగా నిరాశపరిచింది. రూ.80 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, కేవలం 48 కోట్లు మాత్రమే నా పేరు సూర్య వసూలు చేసింది. సుమారు 30 కోట్లకు పైగా నష్టాల‌ను మిగిల్చింది.

     కల్యాణ్ రామ్, నితిన్‌కు ఫ్లాపులే

    కల్యాణ్ రామ్, నితిన్‌కు ఫ్లాపులే

    ఇక నందమూరి కళ్యాణ్ రామ్‌ను కూడా పరాజయాలు వదల్లేదు. నా నువ్వే చిత్రం దారుణంగా పరాజయం పాలైంది. అలాగే పూరి జగన్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని హీరోగా రూపొందిన మెహబూబా చిత్రం పరాజయం పాలైంది. నితిన్‌కు కూడా 2018 చేదు అనుభవాలను మిగిల్చింది. చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు ప్రజాదరణ పొందలేకపోయాయి.

     నాగశౌర్య, అల్లరి నరేష్‌కు

    నాగశౌర్య, అల్లరి నరేష్‌కు

    2018లో పరాజయాల బారిన పడిన వారిలో నాగశౌర్య, అల్లరి నరేష్, నిఖిల్, విజయ్ దేవరకొండ, గోపిచంద్, శర్వానంద్ ఉన్నారు. నాగశౌర్య నటించిన అమ్మమ్మ గారిల్లు, నర్తనశాల దారుణంగా ఫ్లాఫ్‌లుగా మారాయి. నిఖిల్ కిరాక్ పార్టీ, అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్, గోపిచంద్ పంతం, శర్వానంద్ పడిపడి లేచే మనసు అట్టర్ ఫ్లాపులగా నిలిచాయి.

    English summary
    2018 year shows disasters for Tollywood. Pawan Kalyan, Ravi Teja, Nagarjuna, Nani, Naga Shourya tasted failures. Producers and Distibutors get huge losses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X