2020లో హీరోయిన్ల వివాదం.. సమంత-పూజా హెగ్డే వ్యవహారం రచ్చ
కరోనా లాక్డౌన్ వంటి వళ్ల తారలందరూ ఇంటి పట్టునే ఉన్నారు. ఇక ఇంట్లోనే సెలెబ్రిటీలు తమ తమ వ్యాపకాలతో బిజీగా ఉండేవారు. కొందరేమో వెరైటీ వంటకాలను వండటం నేర్చుకున్నారు. ఇంకొందరు కొత్త భాషలను నేర్చుకున్నారు. మరికొందరు కొత్త కొత్త చిత్రాలను ఓటీటీలో వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. అలా పూజా హెగ్డే మజిలీ చిత్రం వీక్షించింది. సినిమా చూసి వదిలేస్తే అది వార్త అయ్యేది కాదు. కానీ సమంతపై దారుణమైన కామెంట్ చేసింది.
సమంత అంత అందంగా ఏమీ కనిపించడం లేదంటూ పూజా హెగ్డే కామెంట్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యేసరికి తన ఖాతాలు హ్యాక్ అయ్యాయని డ్రామా మొదలుపెట్టింది. మొత్తానికి ఆ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారింది. సోషల్ మీడియాలో పూజా హెగ్డేను సమంత ఫ్యాన్స్ ఏకిపారేశారు. పూజా హెగ్డే ఫోటోలను మీమ్స్‌లో రకరకాలు చీల్చి చెండాడారు. చూడటానికి భయంకరంగా ఉన్న ఫోటోలను, పోజులను షేర్ చేస్తూ పూజా హెగ్డే పరువుతీసేశారు సమంత అభిమానులు.

అయితే ఈ గొడవలో మొదటగా సమంతకే మద్దతు లభించింది. కానీ ఆ తరువతా ఈ గొడవలోకి చిన్మయి, నందినీ రెడ్డి వంటి వారు వచ్చి పూజా హెగ్డేను ట్రోల్ చేయడంతో కథ యూటర్న్ తిరిగింది. అందరూ కలిసి మళ్లీ సమంత, ఆమె గ్యాంగ్‌ను ట్రోల్ చేశారు. ఇలా మొత్తానికి సమంత, పూజా హెగ్డేలు విపరీతమైన ట్రోలింగ్‌లను ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ చేసిన హడావిడికి సోషల్ మీడియా ఓ రెండు మూడు రోజులు షేక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











