శోభన్ బాబు ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. నేటితరం స్టార్ హీరోల కంటే ఎక్కువే!

సినిమా ఇండస్ట్రీలో సినీ తారల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం. అయితే ముందు జాగ్రత్తగా అవకాశాలు ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవలనే ఆలోచన అందరికి ఉంటుంది. కానీ కొందరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. అలనాటి సోగ్గాడు శోభన్ బాబు మాత్రం ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ఆస్తులు వేనకేసుకున్నారు. వాటి విలువ నేటితరం స్టార్ హీరోల ఆస్తుల కంటే ఎక్కువే ఉంటుంది.

Recommended Video

Shobhan Babu Assets Value Reached Millions of Crores, More Than Present Tollyood Heros
అసలైన సోగ్గాడు..

అసలైన సోగ్గాడు..

సోగ్గాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శోభన్ బాబు. పోటీగా స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తనదైన శైలిలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకునేవి. ఎక్కువగా మొదటి వారం ఆడవాళ్లే ఆయన సినిమాలు చూడటానికి వచ్చేవారు.

క్రమశిక్షణే ఆయుధం..

క్రమశిక్షణే ఆయుధం..

స్టార్ హీరోగా ఎదగడానికి శోభన్ బాబు చాలానే కష్టపడ్డారు. మొదట్లో సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. నటనతో మంచి గుర్తింపు అందుకొని ఆ తరువాత హీరోగా బిజీ అయ్యారు. కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు సందడి చేస్తున్న సమయంలో శోభన్ బాబు తనదైన శైలిలో హిట్స్ అందుకునేవారు. ఇక శోభన్ బాబు క్రమశిక్షణలో నిబద్దతతో ఉండేవారు. సమయానికి షూటింగ్ కి వచ్చి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లేవారు.

ఆస్తుల విలువ..

ఆస్తుల విలువ..

శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదనను చాలా జాగ్రత్తగా దాచుకునేవారు. ఖర్చులు చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. మద్రాస్ లో అలాగే హైదరాబాద్ లో అప్పట్లో చాలా భూములు కొనుగోలు చేశారు. ఎక్కువగా మద్రాస్ లో వేల ఎకరాలు కొన్నారు. 2008లో ఆయన మరణించే సరికి అప్పట్లో వాటి విలువ 80వేల కోట్లు దాటాయి. ఇక ఇప్పుడు లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

 స్టార్ హీరోల కంటే ఎక్కువే..

స్టార్ హీరోల కంటే ఎక్కువే..

ఒకప్పుడు జాగ్రత్తగా సంపాదించిన డబ్బును భూమిపై పెట్టుబడి పెట్టిన శోభన్ బాబు తోటి నటీనటులకు కూడా అదే విధంగా సలహా ఇచ్చేవారట. ఆయన సలహాతో మురళి మోహన్ కూడా బాగానే సంపాదించారు. నేటితరం స్టార్ హీరోల ఆస్తుల విలువ శోభన్ బాబు ఆస్తులతో పోలిస్తే వారిది చాలా తక్కువేనట. సౌత్ ఇండస్ట్రీలో శోభన్ బాబే నెంబర్ వన్ ఆస్తిపరుడని కొందరు సినీ ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X