లాక్ డౌన్ తరువాత ఫస్ట్ బాక్సాఫీస్ ఫైట్: సిద్దమైన రామ్, రవితేజ.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ఫైట్స్ చూసి చాలా కాలమవుతోంది. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఎన్నో పెద్ద సినిమాలు వచ్చి ఉండేవి. అనుకోని విధంగా వాయిదా పడడంతో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు అసలు థియేటర్స్ లోకి వస్తాయా లేక ఓటీటీలోనే విడుదలవుతాయా అనే అనుమానాలు ఎన్నో వచ్చాయి. అందులో రవితేజ, రామ్ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తనికి ధైర్యం చేసి వాళ్ళు థియేటర్స్ లోకి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

 సంక్రాంతి ఫైట్ లో రామ్, రవితేజ

సంక్రాంతి ఫైట్ లో రామ్, రవితేజ

సంక్రాంతి అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. సంక్రాంతి కోసమే రిలీజ్ చేయాలని ఏడాది ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని కొందరు చాలా వేగంగా షూటింగ్స్ చేస్తుంటారు. ఇక ఈ సారి సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు కొన్ని సంక్రాంతిని టార్గెట్ చేశాయి. రామ్ రెడ్, రవితేజ క్రాక్ విడుదలకు సిద్ధమయ్యాయి.

కాంబినేషన్స్ తోనే భారీ హైప్

కాంబినేషన్స్ తోనే భారీ హైప్

ఇంతవరకు రవితేజ, రామ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ పడింది లేదు. మార్కెట్ పరంగా దాదాపు ఇద్దరు సమానమే. క్రాక్ తో పాటు రెడ్ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలు కూడా అనుకోకుండా వారి దర్శకులతో సరిగ్గా మూడవ సినిమాతో పోటీ పడుతున్నారు. ఈ కాంబినేషన్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

హ్యాట్రిక్ హిట్ కొట్టాలని

హ్యాట్రిక్ హిట్ కొట్టాలని

క్రాక్ సినిమాను డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేని ఇంతకుముందు రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలను డైరెక్ట్ చేయగా.. రామ్ రెడ్ సినిమాను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇంతకుముందు రామ్ తో నేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఇద్దరు హీరోలు దర్శకులతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

Recommended Video

Adipurush : Case Filed On Adipurush Star Saif Ali Khan, Om Raut
రిలీజ్ డేట్.. ఫిక్స్..

రిలీజ్ డేట్.. ఫిక్స్..

క్రాక్ సినిమా జనవరి 14న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా యొక్క టీజర్, సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రామ్ రెడ్ సినిమాకు కూడా అలంటి క్రేజే ఏర్పడింది. ఈ సినిమా దాదాపు అదే టైమ్ లో వచ్చే ఛాన్స్ ఉందట. సంక్రాంతి రిలీజ్ అని సోషల్ మీడియాలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక రెండు సినిమాలలో ఏ సినిమా అత్యధిక వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X