ఫస్ట్ క్రష్ ఉంది కానీ అందులో ఫెయిల్.. కలిసి ఒకే రూంలో ఉన్నాము.. సుశాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లైఫ్‌లో ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అనేది కామన్. అయితే అక్కడి నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాము.. జీవితం ఎలా ముందుకు సాగాలో అన్నది కూడా చూసుకోవాలి. తన జీవితంలోనూ క్రష్ ఉందని అయితే అందులో ఫెయిల్ అయ్యానని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు అక్కినేని హీరో సుశాంత్. మొదటి క్రష్‌లో ఫెయిల్ అయ్యానని చెప్పిన సుశాంత్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఫస్ట్ క్రష్‌లో ఫెయిల్..
తన మొదటి క్రష్ గురించి సుశాంత్ మాట్లాడుతూ.. ఫస్ట్ క్రష్ లేదని చెప్పనని తనక్కూడా ఉందని తెలిపాడు. కానీ అది ఫెయిలైందని ఓ బాంబ్ పేల్చాడు. అందులోంచి బయటపడ్డానికి తనకు 2 వారాల నుంచి నెల రోజులు పట్టిందన్నాడు. నిజానికి అంత త్వరగా ఆ లవ్ నుంచి బయటపడతానని అనుకోలేదని తెలిపాడు.

అవన్నీ సహజం..
అయితే ఆపై త్వరగానే అన్ని మరిచిపోయానని చెబుతూ.. అనుకున్న దానికంటే కాస్త తొందరగానే రికవర్ అయ్యానని అన్నాడు. లైఫ్‌లో ప్రేమ ఎంత సహజమో బ్రేకప్ కూడా అంతే సహజమని తెలిపాడు. అలా డిలీట్ చేసుకుంటూ వెళ్లాలని సలహా ఇచ్చాడు. అదే జీవితమని పేర్కొన్నాడు.. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలని అన్నాడు.

ఒకే రూమ్‌లో ఉన్నాము..
ఫ్యామిలీలో నాగచైతన్యతో చాలా క్లోజ్‌గా ఉంటానని తెలిపాడు. అన్నీ చైతన్యతో షేర్ చేసుకుంటానని అన్నాడు. గతంలో ముంబయిలో తామిద్దరం కలిసి 4-5 నెలలు ఒకే రూమ్ లో ఉన్నామని, కలిసి యాక్టింగ్ నేర్చుకున్నామని పేర్కొన్నాడు. అప్పుడు మరింత బాండింగ్ పెరిగిందని తలెిపాడు. ఏదైనా చైతూతోనే షేర్ చేసుకుంటున్నానని, కాకపోతే చైతూకు పెళ్లయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటున్నానని అన్నాడు.
Recommended Video

ప్రస్తుతం బిజీబిజీగా..
అల వైకుంఠపురములో సినిమాలో ఓ మంచి పాత్రను చేసిన సుశాంత్.. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు' పలకరించనున్నాడు. సినిమాలతోనూ కాకుండా యాడ్స్‌తోనూ సుశాంత్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్ప్రైట్ యాడ్‌లో సుశాంత్ ఆకట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











