Happy Father's Day: తెలుగులో క్రేజీ కాంబోలు.. తండ్రితో నటించిన హీరోలు వీళ్లే.. నాగ్, మహేశ్ రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలా మంది అద్భుతమైన టాలెంట్లతో సూపర్ స్టార్లుగా ఎదిగిపోయారు. తద్వారా తండ్రులు గర్వపడేలా పేరును సంపాదించుకున్నారు. అలాంటి హీరోలే చాలా కాలంగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికీ కొంత మంది హీరోలు, తమ కొడుకులకు పోటీగా సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇక, ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని తండ్రులతో, కొడుకులతో కలిసి నటించిన తెలుగు హీరోల గురించి తెలుసుకుందాం పదండి!

బాలకృష్ణను పరిచయం చేసిన ఎన్టీఆర్

బాలకృష్ణను పరిచయం చేసిన ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే 'తాతమ్మకల' అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దీన్ని తెరకెక్కించింది, ఇందులో హీరోగా నటించింది ఆయన తండ్రి నందమూరి తారక రామారావే. దీని తర్వాత 'అన్నాదమ్ముల అనుబంధం', 'వేములవాడు భీమకవి', 'దాన వీర సుర కర్ణ', 'అక్బర్ సలీం అనార్కలీ', 'వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సహా ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు.

ఏఎన్నార్.. నాగార్జున కలిసి చేసినవివే

ఏఎన్నార్.. నాగార్జున కలిసి చేసినవివే

అక్కినేని నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వర్రావు నటించిన రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. హీరోగా మారిన తర్వాత 'కలెక్టర్ గారి అబ్బాయి', 'అగ్నిపుత్రుడు', 'రావుగారిల్లు', 'ఇద్దరూ ఇద్దరే', 'మనం' వంటి చిత్రాల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. వీటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్ అయినవే ఉన్నాయి. అందుకే వీళ్లకు సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరొచ్చింది.

మహేశ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా తెచ్చిన కృష్ణ

మహేశ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా తెచ్చిన కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కుమారుడు మహేశ్ బాబును చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశారు. మొదట 'నీడ' అనే సినిమాలో నటించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత 'పోరాటం', 'శంఖారావం', 'బజారు రౌడీ', 'గూడఛారి 117', 'కొడుకు దిద్దిన కాపురం', 'అన్నా తమ్ముడు', 'బాలచంద్రులు' అనే మూవీలు చేశారు. ఇక, 'ముగ్గురు కొడుకులు' మూవీలో కృష్ణ మరో కొడుకు రమేశ్ కూడా నటించాడు.

ఇద్దరు కొడుకులతోనూ మోహన్ బాబు

ఇద్దరు కొడుకులతోనూ మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తన ఇద్దరు కొడుకులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అందులో మంచు మనోజ్ 'మేజర్ చంద్రకాంత్' సహా పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, విష్ణు హీరోగా అయిన తర్వాత మోహన్ బాబుతో కలిసి 'రౌడీ' అనే సినిమాలో నటించాడు. అలాగే, మనోజ్ 'పాండవులూ పాండవులూ తుమ్మెద' అనే చిత్రంలో తండ్రితో నటించాడు.

రామ్ చరణ్‌తో చిరంజీవి చేసిన చిత్రాలు

రామ్ చరణ్‌తో చిరంజీవి చేసిన చిత్రాలు

మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడిని సినిమాల్లోకి పరిచయం చేశారు. అతడు నటించిన 'మగధీర'లో ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత 'బ్రూస్‌లీ'లోనూ స్పెషల్ రోల్ చేశారు. ఇక, చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్ ఓ పాటలో డ్యాన్స్ చేశాడు. అలాగే, ఇప్పుడు 'ఆచార్య'లో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇది త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

పెదనాన్నతో కలిసి నటించిన ప్రభాస్

పెదనాన్నతో కలిసి నటించిన ప్రభాస్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు కృష్ణంరాజు పెదనాన్న అవుతారన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ గతంలో 'బిల్లా', 'రెబెల్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, ఈ రెండూ దురదృష్టవశాత్తూ పరాజయం పాలయ్యాయి. ఇక, ఇప్పుడు 'రాధే శ్యామ్'లోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Recommended Video

Dubbing artiste Ghantasala Ratnakumar Career and How he achieved place in india Book of records
తండ్రి, కొడుకుతో నటించిన హీరోలు వీళ్లే

తండ్రి, కొడుకుతో నటించిన హీరోలు వీళ్లే

తండ్రులతో కలిసి నటించిన హీరోలు కొడుకులతోనూ చేయడం చాలా అరుదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేసి చూపించారు మహేశ్ బాబు, నాగార్జున. తన కొడుకు అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ చేశాడు నాగ్. అలాగే, మహేశ్ బాబు తన కొడుకు గౌతమ్‌ను '1 నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇందులో ఇద్దరూ కొన్ని షాట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X