ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు

దాదాపు ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ సందడికి అతిపెద్ద బ్రేక్ పడింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని విదంగా వెండితెరకు చాలా గ్యాప్ వచ్చింది. ఇక ఈ ఏడాది ఏండింగ్ వరకు గ్యాప్ అనే బాకీని తీర్చేందుకు స్టార్ హీరోలు పవర్ఫుల్ సినిమాలతో రాబోతున్నారు. దాదాపు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మొత్తం ఫిక్స్ అయ్యాయి. డేట్స్ మారినా కూడా అటు ఇటుగా రెండు వారాలు తేడా ఉండవచ్చు. ఇక రాబోయే ఇంట్రెస్టింగ్ సినిమాలపై ఒక లుక్కేస్తే..

Recommended Video

Tollywood back to form again.. 2021 will be biggest year ever for telugu Cinema.
 ఈ సంక్రాంతి బిజినెస్ ఎంతంటే..

ఈ సంక్రాంతి బిజినెస్ ఎంతంటే..

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు రావాల్సింది. కరోనా వల్ల ఎవరు రిస్క్ చేయలేదు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం ఆ లోటును కొంత తీర్చడనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ వల్ల గత రెండేళ్ల నుంచి మినిమమ్ మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇక ఈ సారి మాస్ రాజా 50కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ కు ప్రాణం పోశాడు. రామ్ రెడ్ సినిమా కూడా పరవలేదనిపించింది. అటు ఇటుగా 100కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అది కూడా 50% ఆక్యుపెన్సీతో నడిచే థియేటర్స్ తో ఆ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

ముందుగా వకీల్ సాబ్..

ముందుగా వకీల్ సాబ్..

ఇక రానున్న పది నెలల్లో అగ్ర హీరోల ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అలాగే మీడియామ్ హీరోలు కూడా వారి ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. ముందుగా ఏప్రిల్ 9న వాకీల్ సాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

నాని, చైతన్య.. రెడీ..

నాని, చైతన్య.. రెడీ..


ఇక నాని కూడా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 16న రానుంది. ఇక అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టొరీ రిలీజ్ కూడా అప్పుడే. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మెగాస్టార్, ప్రభాస్.. ఎప్పుడంటే..

మెగాస్టార్, ప్రభాస్.. ఎప్పుడంటే..

మెగా స్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య మే 7న రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ కూడా రాధేశ్యామ్ తో సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా జులై 7న వచ్చే అవకాశం ఉంది.

KGF, లైగర్.. కూడా

KGF, లైగర్.. కూడా

విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే. దర్శకుడు పూరి జగన్నాథ్ షూటింగ్ ను ఎంత స్పీడ్ గా ఫినిష్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా జూలై 23న వచ్చే ఛాన్స్ ఉంది. మరో పాన్ ఇండియా మూవీ KGF మే 28న అంటున్నారు గాని దానిపైన డౌట్ ఉంది. కుదరకపోతే జూలై 30న రావచ్చని అంటున్నారు.

RRR అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.. కానీ..

RRR అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.. కానీ..

ఇక జక్కన్న తెరకెక్కిస్తున్న బిగ్గెట్ మల్టీస్టారర్ సినిమా RRR రిలీజ్ పై కూడా మొత్తానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సినిమా ఫైనల్ గా అక్టోబర్ 13న రానున్నట్లు చెప్పేశారు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఈ డేట్ పై కొన్ని అనుమానాలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ అసంతృప్తి ఉన్నారని అందుకే ఎక్కువ లాభాలు వచ్చేలా 2022 సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X