కొత్త ఆలోచన.. విత్తన వినాయకుడిని ప్రమోట్ చేస్తోన్న టాలీవుడ్
రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టి మంచి కార్యక్రమాలకు టాలీవుడ్ మద్దతు ఎప్పుడూ లభిస్తూనే ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను తెలుగు చిత్ర సీమ భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ చేతుల మీదుగా మూడో దశను ప్రారంభింపజేశాడు. ఇక వినాయక చవితి సందర్భంగా సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
పచ్చని ప్రకృతి కోసం అనుక్షణం పరితపించే సంతోష్ కుమార్.. వినాయకుని విగ్రహాలతో దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ హితమైన విత్తన వినాయకులను చిత్ర ప్రముఖులందరికీ అందజేస్తున్నారు. ప్రతీ సెలెబ్రిటీకి పేరు పేరునా అందిస్తూ.. వాటిని ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేయాలని వచ్చే మొక్కను అతి పవిత్రంగా కాపాడుకోవాలని కోరారు. ఈక్రమంలోనే మంచు లక్ష్మీ తన ఇంటికి వచ్చిన విత్తన వినాయకుడిపై స్పందించింది.

ఎంపీ సంతోష్ పంపిన ఆ విగ్రహాన్ని చూపిస్తూ.. 'ఈ అందమైన విత్తన వినాయకుడితో ఈ గణేష్ చతుర్థి నాడు మీ ఇంటికి దేవుడ్ని ఆహ్వానించండి.. ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుని మన ప్రకృతిని పరిరక్షిస్తాను.. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను మరి మీరు?.. గొప్ప కార్యక్రమానికి ముందడుగు వేసిన సంతోష్ గారికి ధన్యవాదాల'ని మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. ఇప్పటికే టాలీవుడ్ పెద్దలందరికీ సంతోష్ కుమార్ ఈ వినాయకులను అందజేశారు.


Click it and Unblock the Notifications











