twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    180 రిలీజైతే అన్ని ఫట్టే.. హిట్టైనవి ఎన్నంటే.. టాలీవుడ్ 2018 రాత ఇదే..!

    |

    ప్రతీ సంవత్సరం మాదిరిగానే 2018లో తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదల అయ్యాయి. 143 తెలుగు చిత్రాలు స్రెయిట్‌గా, 41 చిత్రాలు ఇతర భాషల నుంచి డబ్బింగ్ సినిమాలుగా విడుదలయ్యాయి. అయితే ఈ సంవత్సరం కూడా ఫెయిల్యూర్ శాతం ఎక్కువగానే కనిపించింది. సక్సెస్ రేటు 15 శాతానికి అటు ఇటుగా ఉంది. నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు భారీగా లాభాలను తెచ్చి పెట్టిన సినిమాలు ఇవే..

     బాలయ్య జై సింహా, భాగమతిగా అనుష్క

    బాలయ్య జై సింహా, భాగమతిగా అనుష్క

    సంక్రాంతి కానుకగా ఎప్పటి లానే నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగాడు. జనవరి 12న రిలీజైన జై సింహా భారీగా ప్రేక్షకదారణను కూడగట్టుకొన్నది. పవన్ కల్యాణ్ నటించిన అజాతవాసి చిత్రం దారుణమైన ఫ్లాప్ కావడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జై సింహా రికార్డు సొంతం చేసుకొన్నది. ఇక బాహుబలి తర్వాత భారీ అంచనాలతో జనవరి 26న రిలీజైన భాగమతి సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకొన్నది. అనుష్క సోలోగా భారీ విజయాన్ని అందుకొన్నది.

    చలో, తొలిప్రేమ, అ! సినిమాల హడావిడి

    చలో, తొలిప్రేమ, అ! సినిమాల హడావిడి

    ఇక ఫిబ్రవరి మాసం తెలుగు సినిమాకు కలిసి వచ్చింది. ఫిబ్రవరి 2న నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన ఛలో చిత్రం హడావిడి లేకుండా వచ్చి భారీ కలెక్షన్లతో హల్‌చల్ చేసింది. ఫిబ్రవరి 10న మెగా హీరో వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన తొలి ప్రేమ చిత్రం బంపర్ హిట్ కొట్టేసింది. భారీ లాభాలను కూడా సాధించింది. అదే క్రమంలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా.. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఫిబ్రవరి 16న అ! చిత్రం వచ్చింది. ఈ చిత్రం సిని విమర్శకులను మెప్పించడమే కాకుండా దండిగా కలెక్షన్లు రాబట్టింది.

    నీది నాది ఒకే కథ అన్న మార్చి నెల

    నీది నాది ఒకే కథ అన్న మార్చి నెల

    మార్చి నెల కూడా టాలీవుడ్‌కు విజయశోభ తెచ్చిపెట్టింది. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి వేణు ఊడుగుల రూపొందించిన నీది నాది ఒకే కథ చిత్రం మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే బ్రహ్మండమైన స్పందనను సొంతం చేసుకొన్నది. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం భారీ లాభాలను సొంతం చేసుకొన్నది. ఇక నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే చిత్రం కూడా అదే రోజు రిలీజైంది. ఈ చిత్రం కూడా భారీ లాభాలను సొంతం చేసుకొన్నది.

     సెన్సేషనల్ హిట్‌గా రంగస్థలం మూవీ

    సెన్సేషనల్ హిట్‌గా రంగస్థలం మూవీ

    మార్చి నెలలో రిలీజైన భారీ బడ్జెట్ చిత్రం రంగస్థలం. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మార్చి 30న వచ్చిన చిత్రం ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. సినిమా మేకింగ్ రూపాన్నే ప్రభావితం చేసిన చిత్రంగా ఈ సినిమా పేరుతెచ్చుకొన్నది. ఆధునిక తెలుగు సినిమా చరిత్రలోనే అద్భుతమైన చిత్రం కొనియాడబడింది.

    200 కోట్ల క్లబ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు

    200 కోట్ల క్లబ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు

    ఏప్రిల్ నెల కూడా టాలీవుడ్‌కు కాసుల పంట పడించింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ, ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక, సమకాలీన రాజకీయ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

    వెండితెరపై మహానటి సావిత్రి

    వెండితెరపై మహానటి సావిత్రి

    2018లో తెలుగు సినీ పరిశ్రమకు మే నెల ప్రత్యేకంగా నిలిచింది. తెలుగులో మరుపురాని నటిగా సుస్థిర స్థానం సంపాదించుకొన్న మహానటి సావిత్రి జీవితం వెండితెర మీద ఆవిష్కృతమైంది. మే 9వ తేదీన రిలీజైన మహానటి చిత్రం తొలి ఆట నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. అలాగే భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. సినీ విమర్శకుల ప్రశంసలూ అందుకొన్నది.

     టాలీవుడ్‌లో సమ్మోహనం మూవీ

    టాలీవుడ్‌లో సమ్మోహనం మూవీ

    జూన్ మాసంలో ఒకే చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అందాల నటి అదితిరావు హైదరీ, సుధీర్‌బాబు జోడిగా నటించిన సమ్మోహనం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు కమర్షియల్‌గా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నది.

    సెన్సేషనల్‌గా RX 100 మూవీ

    సెన్సేషనల్‌గా RX 100 మూవీ

    ఇక జూలై నెల సంచలనానికి కారణమైంది. కేవలం రూ.2 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన RX 100 చిత్రం సంచలనం విజయం సాధించింది. నూతన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో నూతన హీరో హీరోయిన్లు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

    గీత గోవిందం కాసుల పంట

    గీత గోవిందం కాసుల పంట

    టాలీవుడ్‌లో ఆగస్టు నెల కాసుల పంటను పండించింది. ప్రయోగాత్మకంగా రూపొందించిన గూఢచారి చిత్రం ఆగస్టు 3న రిలీజైంది. ఈ చిత్రం భారీ లాభాలను సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఇక విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజైన విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు ప్రేక్షకులకు అత్యంత ఆదరణ కనపడింది. రూ. 5 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.130 కోట్ల వసూళ్లను సాధించింది.

    టాలీవుడ్‌కు గుర్తింపు కేరాఫ్ కంచరపాలెం

    టాలీవుడ్‌కు గుర్తింపు కేరాఫ్ కంచరపాలెం

    2018లో టాలీవుడ్‌ సినీ మేకింగ్‌కు మంచి పేరు తెచ్చిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం. ఈ చిత్రం చిన్న తరహా బడ్జెట్ రూపొంది రూ.5 కోట్లు వసూలు చేసింది. ఇదే నెలలో రిలీజైన శైలజారెడ్డి అల్లుడు కూడా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రూపొందింది.

    అరవిందుడి కలెక్షన్ల వీర విహారం

    అరవిందుడి కలెక్షన్ల వీర విహారం

    2018లో అక్టోబర్ నెల బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా నిలిచింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. పూజా హెగ్డే, ఇషా రెబ్బ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేసింది. సుమారు రూ.160 కోట్ల వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    టాక్సీవాలా.. 2.0 మూవీతో బొనాంజా

    టాక్సీవాలా.. 2.0 మూవీతో బొనాంజా

    నవంబర్ నెల 2018 సంవత్సరానికి బాక్సాఫీస్ బోనాంజాగా మారింది. విజయ్ నటించిన సర్కార్ చిత్రం నవంబర్ 6న రిలీజైన భారీ విజయాన్ని అందుకొన్నది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా నవంబర్ 17న విడుదలై అద్బుతమైన సక్సెస్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే పూర్తిగా ఆన్‌లైన్‌లో రిలీజైనప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఇక రజనీకాంత్, శంకర్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్రం అత్యధిక బడ్జెట్‌తో రూపొందింది.

    కేజీఎఫ్ బంగారు పంట

    కేజీఎఫ్ బంగారు పంట

    డిసెంబర్ 14న రిలీజైన హుషారు చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. రూ.1కోటికిపైగా బడ్జెట్ రూపొందిన ఈ సినిమా సుమారు రూ.8 కోట్లు వసూలు చేసింది. హర్ష తొలిసారి దర్శకత్వం వహించి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 2018లో ముగింపులో విడుదలైన కన్నడ డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ భారీ విజయాన్ని అందుకొన్నది. యష్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజైంది. తెలుగులో భారీగా, క్రేజీగా రిలీజైన పడిపడి లేచే మనసు, అంతరిక్షం చిత్రాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లను సాధిస్తున్నది. బంగారు గనుల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది.

    English summary
    2018 year is not favorable for Tollywood. overall 180 plus movies released but, only 20 plus movies got success. Rangasthalam, Bharath Ane Nenu, Geeta Govindam, Jai Simha, Toliprema, Aravinda Sametha Veera Raghava, RX 100, Sammohanam movies are in Success list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X