అతిథి పాత్రలో తెలుగు టాప్ దర్శకులు.. హరీష్, సందీప్, అనిల్ కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా?

ఇప్పుడు మన తెలుగు సినిమా దగ్గర అనేకమంది సీనియర్ దర్శకులు యువ దర్శకులు కూడా తమ వర్క్ తో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఎవరి స్టైల్ వారిది వాళ్ళ వాళ్ళ రీతిలో సినిమాలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ ని అనేకమంది దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగులో ఉన్న చాలా మంది దర్శకులు ఈ స్టార్డంకి ముందు చాలానే కష్టాలు పడి వచ్చారు.

ఇతర సినిమాలకి సహాయ్ దర్శకులు గానో ఆ దర్శకులు చెప్పినట్టుగా మాట వినే సెట్ బాయ్ లానో, క్లాప్ బోర్డు కొట్టడమో ఇలా ఎన్నెన్నో పనులు చేసి ఉంటారు. అవే కాకుండా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో అసలు మనం గుర్తు కూడా పట్టలేని విధంగా వారు ఆ సినిమాలు చేశారు. దర్శకులుగా తెర వెనుక ఉంటారు, అప్పట్లో పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కనిపించిన ఆ దర్శకులు ఎవరెవరు అంటే..

tollywood star directors acted as cameos in old movies

మొదటిగా ప్రస్తుతం ఇండియాని షేక్ చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం "కల్కి 2898 ఎడి" దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఓ సినిమాలో ఉన్నాడని తెలుసా? అసలు ఆ సినిమా ఏంటో కూడా చెబితే ఆశ్చర్యపోతారు, ఆ సినిమా మరేదో కూడా కాదు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాగ్ అశ్విన్ కనిపిస్తాడు. బి ఫేజ్, గోల్డ్ ఫేజ్ మ్యాచ్ సీక్వెన్స్ ని బాగా గమనిస్తే నాగ్ అశ్విన్ దొరికేస్తాడు.

ఇక టాలీవుడ్ పవర్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పలు చిత్రాల్లో క్యామియోలు చేసాడు. హీరో తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో ట్రైన్ ఎపిసోడ్స్ లో అయితే హరీష్ శంకర్ కనిపిస్తాడు. అలాగే ఈ సినిమాలోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి "అందరివాడు" సినిమాలో కూడా హరీష్ శంకర్ బ్రహ్మానందంతో కనిపిస్తారు. అలాగే ఇండియాని షేక్ చేసిన మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అక్కినేని నాగార్జున నటించిన "కేడి" సినిమాలో కనిపిస్తాడు.

ఆ చిత్రానికి తాను అసిస్టెంట్ గా కూడా వర్క్ చేసాడు. ఇంకా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అల్లు అర్జున్ "ఆర్య" సినిమాలో నటిస్తే.. దర్శకుడు వంశీ పైడిపల్లి రెబల్ స్టార్ ప్రభాస్ "వర్షం" సినిమాలో బస్ సీక్వెన్స్ లో కనిపిస్తారు. అలాగే మాస్ దర్శకుడు వీరసింహా రెడ్డి, క్రాక్ లాంటి సినిమాలు అందించిన గోపీచంద్ మలినేని మెగాస్టార్ "స్టాలిన్" లో నటించగా అతను ఆ సినిమాకి అసిస్టెంట్ దర్శకునిగా కూడా పని చేశారు.

ఇంకా టాలీవుడ్ వరుస హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడి గోపీచంద్ నటించిన "శౌర్యం" సినిమాలో కనిపిస్తారు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి చాలా మంది దర్శకులే పలు చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ క్యామియోస్ లో కనిపించారని చెప్పాలి. అయితే సినిమాలు చేస్తూనే తమ సినిమాల్లో మాత్రం దర్శకుడు రాజమౌళి, పూరి జగన్నాథ్ లాంటి స్టార్స్ అప్పుడు నుంచే తమ సినిమాల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X