పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ప్లాన్స్ మామూలుగా లేవు.. వరుసగా 6 సినిమాలు.. బాస్ కూడా తగ్గట్లే!

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానులకు రానున్న రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ ఫెస్టివల్స్ అనే చెప్పాలి. లాక్ డౌన్ వల్ల ఎలాంటి జ్ఞానోదయం అయ్యిందో తెలియదు గాని మన స్టార్ హీరోలు మాత్రం ఇప్పట్లో రెస్ట్ తీసుకునేలా లేరు. ఒకరిని మించి మరొకరు సినిమాలను ఓకే చేస్తున్నారు. సాధారణంగా ఒక సినిమా అయిపోతే గాని మరో సినిమా గురించి ఆలోచించని మన బడా స్టార్స్ ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇక ఆ హీరోల లైనప్ పై ఒక లుక్కేస్తే..

అందరికంటే ఎక్కువ సినిమాలు

అందరికంటే ఎక్కువ సినిమాలు

డార్లింగ్ ప్రభాస్ లైనప్ కూడా మామూలుగా లేదు. అగ్ర హీరోల్లో ఇప్పుడు ఎక్కువగా 6 సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో ప్రభాస్. 20వ సినిమా రాధేశ్యామ్ అనంతరం 21వ సినిమాగా సలార్ రానుంది. ఇక 22వ ప్రాజెక్ట్ ఆదిపురుష్, 23వ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోంది. మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో 24వ సినిమా చేయబోతున్న ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తో 25వ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇంకా ఆ సినిమాకు దర్శకుడు సెట్టవ్వలేదు.

ఎన్టీఆర్ 4 సినిమాలు..

ఎన్టీఆర్ 4 సినిమాలు..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే 4 సినిమాలపై ఓ క్లారిటీ వచ్చేసింది. 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. 32వ ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సైలెంట్ గా స్పీడ్ పెంచుతున్న చెర్రీ

సైలెంట్ గా స్పీడ్ పెంచుతున్న చెర్రీ

మరో RRR హీరో రామ్ చరణ్ కూడా 5 సినిమాల లైనప్ ఫిక్స్ అయ్యింది. సైలెంట్ గానే కొత్త కథలను వింటున్నాడు. ఆచార్య ద్వారా ఆడియెన్స్ కు సరికొత్త కిక్కివ్వబోతున్న చరణ్ ఇదే ఏడాది RRRతో కూడా సందడి చేయనున్నాడు. ఇక 15వ సినిమాను రోబో డైరెక్టర్ శంకర్ తో, 16వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయవచ్చని సమాచారం. ఇక 17వ ప్రాజెక్ట్ వంశీ పైడిపల్లితో ఉండవచ్చని టాక్.

పవర్ స్టార్.. పవర్ఫుల్ కాంబినేషన్స్..

పవర్ స్టార్.. పవర్ఫుల్ కాంబినేషన్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు పాలిటిక్స్ తోనే కాకుండా మరోవైపు సినిమాలతో కూడా చాలా బిజీగా మారుతున్నారు. 5 సినిమాల గురించి అందరికి తెలిసిందే. వకీల్ సాబ్ అనంతరం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ 27వ సినిమాగా రాబోతోంది. క్రిష్ దర్శకత్వంలో 28వ సినిమా. హరీశ్ శంకర్ తో 29వ సినిమా. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 30వ సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

బాస్ కూడా తగ్గట్లేదు

బాస్ కూడా తగ్గట్లేదు

ఇక నేటితరం హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి లైనప్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉందనే చెప్పాలి. 152వ సినిమాగా రూపొందుతున్న ఆచార్య అనంతరం మెగాస్టార్ మరో మూడు సినిమాలను లైనప్ లో పెట్టాడు. (153)లూసిఫర్ రీమేక్ తో పాటు తమిళ్ వేదాళం రీమేక్ సినిమాను (154) మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక జై లవకుశ దర్శకుడు బాబీతో కూడా ఒక సినిమా(155) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X