Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రాఖీలతో దర్శనమిచ్చిన స్టార్ హీరోలు, వారి పిల్లలు.. మెగా, అల్లు, ఘట్టమనేని స్పెషల్ ఫొటోస్ వైరల్
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ అంటే భారత దేశంలో ఎంతో ప్రత్యేకమైన పండగ. మతాలకు, కులాలకు అతీతంగా జరుపుకునే ఈ ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇక నేడు రాఖీ పండగ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ తారలు కూడా వారి సోదరీమణులతో ఉన్న స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఒకసారి ఆ ఫోటోలపై ఒక లుక్కేస్తే..
Recommended Video

సితారా, గౌతమ్ స్పెషల్ పిక్
సితారా, గౌతమ్ ట్రేడిషినల్ లుక్ లో రక్ష బంధన్ ని హ్యాపీగా సెలబ్రెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అలాగే మహేష్ సోదరి మంజుల తన ఇద్దరు సోదరులతో ఉన్న పాత ఫోటోలను ట్విట్టట్ ద్వారా షేర్ చేసుకున్నారు.

లవ్యూ సిస్టర్ అంటూ.. వరుణ్ తేజ్
ఇక మెగా హీరో వరుణ్ తేజ్ తన చెల్లి నిహారికతో రాఖీని కట్టించుకొని ఆప్యాయంగా ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి లవ్యూ నిహారిక అని వరుణ్ తేజ్ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు వారి ఇంట్లో..
ఇక అల్లు అర్జున్ కూతురు అర్హకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన అన్నయ్య అయాన్ కి రాఖీ కడుతున్న ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అన్నయ్యకి ప్రేమగా బొట్టు పెడుతూ కనిపించింది అర్హ.

ఇస్మార్ట్ బ్యూటీ.. కంగనా స్పెషల్
ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ కూడా తన సోదరుడితో రాఖీ పట్టుకోని స్పెషల్ ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఇక కంగనా రనౌత్ కూడా తన సోదరుడికి రాఖీ కట్టింది. చేతిలో హారతి పళ్లెం పట్టుకొని ఆప్యాయంగా ఫోటోకి స్టిల్ ఇచ్చింది.

రాజీవ్ కనకాల
'నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడ్తుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను' అని ట్విట్టర్ ఫోటో షేర్ చేసుకున్నాడు.

నాని చిన్నప్పటి ఫోటో
నాని కూడా తన సోదరితో చిన్నప్పుడు దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన సోదరి ట్విట్టర్ ఎకౌంట్ ని కూడా నాని ట్యాగ్ చేస్తూ.. ఎల్లప్పుడూ తను నాకు సపోర్ట్ గా ఉంటుందని వివరణ ఇచ్చాడు.

రామ్ క్యూట్ ఫోటో
రామ్ పోతినేని కూడా తన సోదరితో చిన్ననాడు రాఖీ కట్టించుకున్న స్పెషల్ క్యూట్ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ అందరికి రక్షా బంధన్ విషెస్ అంధించాడు.