మహేష్ నుంచి చరణ్ వరకు మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..
సినిమా ప్రపంచంలో తారలకు సంబంధించిన ఇష్టాలపై అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. స్టార్స్ వాడే వస్తువుల నుంచే వేసుకునే బట్టల వరకు అన్నిటినీ ఫాలో అయ్యే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొందరు ఉంటారు. ఇక హీరోలు కూడా అందరిలాంటి వారే కాబట్టి వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు క్రష్ ఫీలింగ్ ను చూసినా వారే. ఇక మన స్టార్స్ లో కొందరు టీచర్లపై, హీరోయిన్స్ పై కూడా మనసు పారేసుకున్నారు.

మహేష్ ఫస్ట్ క్రష్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ నమ్రతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె కంటే ముందు వరకు మహేష్ మనసులో హాలీవుడ్ యాక్టర్ డేమి మూరె ఉందట. ఆమెనే తన ఫస్ట్ క్రష్ అని.. కొన్నేళ్ల వరకు అలానే ఊహించుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో పాజిటివ్ గా వివరణ ఇచ్చాడు.

ఐశ్వర్యారాయ్ అంటే పిచ్చి
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే కూడా అమ్మాయిలు చాలా బాగా లైక్ చేస్తారు. అయితే బన్నీ చిన్నతనంలోనే ఐశ్వర్యారాయ్ కు గుండెల్లో గుడి కట్టేసుకున్నాడట. ఆమె నా ఫస్ట్ క్రష్ అని చాలాసార్లు చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్ మోస్ట్ ఐశ్వర్యారాయ్ అన్ని సినిమాలు చూసేశాడట.

RRR హీరోలకు శ్రీదేవి..
ఇక RRR హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఇద్దరికి కూడా శ్రీదేవి చాలా ఇష్టమట. రామ్ చరణ్ చిన్నతనం నుంచి శ్రీదేవిపై అభిమానాన్ని పెంచుకోగా ఎన్టీఆర్ కూడా శ్రీదేవి సినిమా వస్తే ఆమెను తప్ప మరొక విషయాన్ని పట్టించుకునేవాడు కాదట.
Recommended Video

ప్రభాస్ ఫస్ట్ క్రష్
ఇక ప్రభాస్ అయితే అందరికంటే విభిన్నమైన క్రష్ గురించి చెప్పాడు. చెన్నైలోని డాన్ బొస్కో స్కూల్ లో చదివేటప్పుడు అక్కడ క్లాస్ టీచర్ ను చూసి ఫిదా అయ్యాడట. ఆమెనే తన క్రష్ అని ఇప్పటికి కూడా టీచర్ పై అదే ఫీలింగ్ ఉందని ఓపెన్ గానే చెప్పేశాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినటువంటి ఈ స్టార్ హీరో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











