For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పండుగాడికి 14 ఏళ్లు.. బాక్సాఫీస్ మైండ్ బ్లాంక్ అయి దిమ్మతిరిగేలా పోకిరి.. చిరుకు సాధ్యం కాని..

  |

  సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టించింది. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 14 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. పలు చోట్ల ఆల్‌టైమ్ రికార్డులతో పోకిరి తెలుగు సినీ ప్రపంచంలో ప్రభంజనం సృష్టించింది. వెండితెరపై పూరీ, మహేష్ చేసిన పోకిరి చేష్టలు ఇవే..

  ఇండస్ట్రీ రికార్డుతో

  ఇండస్ట్రీ రికార్డుతో

  పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కాకుండా వైష్ణో అకాడమీ బ్యానర్‌పై మంజుల ఘట్టమనేనితో కలిసి ఇందిర ప్రొడక్షన్ బ్యానర్‌పై పోకిరి చిత్రం సంయుక్తంగా రూపొందింది. రూ.10 నుంచి 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రూ.70 కోట్ల వరకు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.40 కోట్లు వసూలు చేయడం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు.

  తూటల్లా పేలిన డైలాగ్స్

  తూటల్లా పేలిన డైలాగ్స్

  పోకిరి సినిమా విజయానికి కారణం ప్రధానంగా పూరి జగన్నాథ్ రాసిన మాటలు, ఆయన టేకింగ్. దానికి తోడు మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్, ఇలియానా గ్లామర్ ప్రేక్షకులను మరింత రంజింప చేసింది. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' లాంటి డైలాగ్స్ సగటు ప్రేక్షకుడి నాలికపై నాట్యం చేశాయి. ఇవే సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి.

  100, 200, 365 రోజులు

  100, 200, 365 రోజులు

  టాలీవుడ్‌లో పోకిరి విజయం ఓ సునామీ లాంటి వాతావరణాన్ని సృష్టించింది. విడుదలైన ఎక్కువ సెంటర్లలో 365 రోజుల పోస్టర్ పడింది. కర్నూలు లాంటి పట్టణంలో ప్రతీ రోజు నాలుగు షోలతో ఏడాదికిపైగా ఏకధాటిగా ఆడింది. 200 సెంటర్లలో 100 రోజులు ఆడింది. కేవలం హైదరాబాద్‌లోనే 17 సెంటర్లలో 100 రోజులు ఆడటం విశేషం. ఇక 15 సెంటర్లలో ఈ సినిమా 200 రోజులు ఆడింది. 63 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ ఆడటం ఈ సినిమా సత్తాకు అద్దం పట్టింది.

  చిరంజీవికి సాధ్యం కాని రికార్డు

  చిరంజీవికి సాధ్యం కాని రికార్డు

  టాలీవుడ్‌ను మెగాస్టార్ చిరంజీవి పాలిస్తున్న రోజుల్లో ఆయనకు సాధ్యం కాని కలెక్షన్లను పోకిరి వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్లు వసూలు చేయడం అప్పట్లో రికార్డు. అప్పటి వరకు ఏ హీరోకు సాధ్యపడని ఫీట్‌ను మహేష్‌బాబు సొంతం చేసుకొన్నారు. ఇప్పటికీ పోకిరి సినిమాకు అదే క్రేజ్ ఉండటం గమనార్హం. ఇంతటి విజయాన్ని రిలీజైన రోజు మార్నింగ్ షో తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ అంచనా వేయడం సినిమాపై ఆయనకు ఉన్న కమాండ్ తెలియజేసింది.

  Ileana D’Cruz Viral Pic || మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది..!!
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు, సాంకేతిక వర్గం
  నటీనటులు: మహేష్‌బాబు,ఇలియానా, ప్రకాశ్ రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, బ్రహ్మానందం తదితరులు
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
  నిర్మాతలు: పూరీ జగన్నాథ్, మంజుల ఘట్టమనేని
  సంగీతం: మణిశర్మ
  కెమెరా: శ్యాం కే నాయుడు
  ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
  బ్యానర్స్: వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్
  రిలీజ్: ఏప్రిల్ 28, 2006
  బడ్జెట్: 10 నుంచి 12 కోట్లు
  కలెక్షన్లు: 70 కోట్లు

  English summary
  Pokiri is an action thriller film written and directed by Puri Jagannadh. The film was produced by Jagannadh and Manjula Ghattamaneni by their respective production companies Vaishno Academy and Indira Productions. The film stars Mahesh Babu and Ileana D'Cruz; Prakash Raj, Nassar, Ashish Vidyarthi and Sayaji Shinde appear in prominent roles. This movie was released on 28 April, 2006. Now its completed 14 years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X