Year Ender 2023: ఈ ఏడాది ఓటీటీలో మెప్పించిన టాప్ 10 సిరిసులివే... వీటిలో ఏమైనా మిస్‌ అయ్యారా..?

ఈ ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఇక ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు, సిరీసులు రిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీలో డైరెక్టుగా వచ్చిన సిరీసుల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి వాటిలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏంటి.. అందులో తెలుుగ వెబ్ సిరీసులు ఏమైనా ఉన్నాయా.. వాటిలో మీరు ఏమైనా మిస్ అయ్యారా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ కంటెంట్ కు అలావాటు పడ్డారు. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల కోసం.. ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఓటీటీలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు, సిరీసులు సందడి చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది వచ్చిన సీరిసుల్లో ప్రేక్షకులు దేన్ని ఆదరించారు... ఏ సిరీస్ ఆకట్టుకుంది.. అందులో మీరేమైనా మిస్ అయ్యారా.. ఓసారి లుక్ వేయండి.

Top 10 Web Series in 2023: Dhootha, Farzi, Rana Nayudu, Dahaad, Kalapani, Scoop, Pippa etc Full Details Here

1 నాగాచైతన్య దూత... హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూత. 'మనం', '24' చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఈ సిరీసును రూపొందించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జర్నలిజం ఇతివృత్తంగా హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు మిస్ అయితే కనుక ఓ లుక్ వేసేయండి.

2 షాహిద్ విజయ్ సేతుపతి ఫర్జి: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఫస్ట్ సిరీస్ ఫర్జీ. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్- డీకే దర్శకత్వం వహించారు. తాత నెలకొల్పిన పత్రికా కార్యాలయం మూతపడిపోవడంతో ఎలాగైనా దాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్న ఓ యువకుడి కథగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Top 10 Web Series in 2023: Dhootha, Farzi, Rana Nayudu, Dahaad, Kalapani, Scoop, Pippa etc Full Details Here

3 రానా వెంకటేష్ రానా నాయుడు: మొదటి సారి రానా, వెంకటేష్ నటించిన సిరీస్ రానా నాయుడు. ఇక ఈ సిరీస్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. 'నెట్‌ఫ్లిక్స్‌' విడుదల చేసిన.. ఈ వెబ్‌సిరీస్‌ 'ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌ల జాబితాలో స్థానం దక్కించుకుంది.

Top 10 Web Series in 2023: Dhootha, Farzi, Rana Nayudu, Dahaad, Kalapani, Scoop, Pippa etc Full Details Here

4 రియల్ స్టోరీ ది రైల్వేమెన్‌: 1984లో చోటుచేసుకున్న భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన సిరీస్ ది రైల్వేమెన్.. శివ్‌ రావైల్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో మాధవన్‌, కేకే మేనన్‌, దివ్యేందు శర్మ, మందిరా బేడీ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5 కాలాపాని: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని నీరు కలుషితమవడానికి కారణమేంటి.. ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే అంశంతో సమీర్‌ సక్సేనా, అమిత్‌ సంయుక్తంగా రూపొందించిన సిరీస్‌ కాలా పాని. ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మోనా సింగ్‌, అశుతోష్‌ గోవారికర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

6 ది ఫ్రీలాన్సర్‌: నటీనటులు: ది ఫ్రిలాన్సర్ సిరిస్ సిరియా సరిహద్దుల్లో ఉన్న ఐసిస్‌కు చెరలో చిక్కుకున్న అలియా అనే మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగిన అవినాష్‌ దామోదరన్‌ ఎలాంటి సాహసం చేశాడనే కథాశంతో తెరకెక్కింది. ఇక ఈ సిరీస్‌ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రిమింగ్ అవుతుంది.

7. సేవ్‌ ది టైగర్స్‌: మంచి వినోదాన్ని పంచే ముగ్గురు భార్యా బాధితుల కథనే సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రిమింగ్ అవుతుంది.

8. స్కామ్‌ 2003- ది తెల్గీ స్టోరీ: 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా స్కామ్ తెరకెక్కింది. ఇది సోనిలీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

9 దహాద్‌: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయిన యువతి కేసు విచారణలో భాగంగా ఎస్‌ఐ అంజలి భాటి ఎదుర్కొన్న సవాళ్లను కథాంశంగా తెరకెక్కింది దహద్ సిరీస్. సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

10. పిప్పా: ఇషాన్‌ ఖట్టర్‌ , మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్... 1971లో జరిగిన ఇండో- పాకిస్థాన్‌ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి భారతదేశం కోసం పోరాడిన కెప్టెన్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా జీవితం ఆధారంగా రూపొందింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X