twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Father's Day : నాన్న ప్రేమని తట్టి లేపిన సినిమాలు ఇవే.. డోంట్ మిస్!

    |

    ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఫాదర్స్ డే విషెస్ చెబుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడమే కాక తమ పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫోటోలను సైతం షేర్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా టాలీవుడ్లో తండ్రి గొప్పదనాన్ని గుర్తుచేసి, తండ్రి ప్రేమను చాటిచెప్పిన టాప్ ఫైవ్ సినిమాలను మీముందుంచుతున్నాం.

    బొమ్మరిల్లు

    బొమ్మరిల్లు

    టాలీవుడ్లో ఫాదర్ సెంటిమెంట్ సినిమా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు.. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన తండ్రి మాట ఎదురు చెప్పలేక చివరివరకు మదనపడుతూ ఉండే కుర్రవాడిగా సిద్ధార్థ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ తమ కొడుకులను తమ అదుపులో పెట్టుకునే తండ్రులను బొమ్మరిల్లు ఫాదర్ అంటూ సంబోధిస్తారు అంటే ఈ సినిమా ప్రేక్షకుల మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

    నాన్నకు ప్రేమతో

    నాన్నకు ప్రేమతో

    టైటిల్లో ఉన్నట్లుగానే ఈ సినిమా అంపశయ్య మీద ఉన్న ఒక తండ్రికి ఆయన జీవితంలో చేయాలని భావించిన పని చేసి కొడుకు ఎలా గిఫ్ట్ ఇచ్చాడు అనే కోణంలో తెరకెక్కించారు. ఎన్టీఅర్ మినహా మిగిలిన మరో ఇద్దరు కొడుకులు ఆయన ఎలాగో చనిపోతాడు ఇప్పుడు ఆ కోరిక తీర్చే దానికంటే ఆయన పక్కన ఉండే సమయం గడిపి ఆ కోరిక తీర్చే చేశామని అబద్దం చెబుతామని అంటారు. ఎన్టీఆర్ మాత్రం తండ్రి చివరి కోరికను నెరవేర్చడం శాయశక్తులా కృషి చేసి దాని నెరవేరుస్తాడు. తండ్రికి నిజమైన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఆయన అనుకుని చేయలేకపోయిన పని చేసి బహుమతిగా ఇవ్వడమే అని ఈ సినిమా చాటిచెప్పింది.

    సన్నాఫ్ సత్యమూర్తి

    సన్నాఫ్ సత్యమూర్తి

    ఇక నాన్న ప్రేమకు గుర్తుగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా నిలుస్తుంది. తన తండ్రి ఎంతో గొప్పవాడు అని నమ్మే అల్లు అర్జున్ తన తండ్రి గురించి వందమంది మంచిగానే మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో కోట్ల రూపాయల ఆస్తిని కూడా క్షణాల్లో వదిలేస్తాడు. అలా తన తండ్రి అనుకోకుండా ఒకరికి నష్టం చేకూర్చారని తెలియడంతో ఆ నష్టం తీర్చేందుకు తాను కష్టంలో ఇరుక్కుంటాడు. తండ్రి ఇచ్చిన ఆస్తులే కాదు తండ్రి మీద మరకలు పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులదే అని చాటిచెప్పిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

    ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

    ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

    టైటిల్ వినడానికి ఒక లవ్స్ స్టోరీ లాగా ఉన్నా ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుండెలకు హత్తుకొనేలా చూపించగలిగాడు దర్శకుడు. ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటే ఏ తండ్రి అయినా కష్టంగానే ఉంటుంది. వాళ్లకు తిండి పెట్టలేక కాదు ఎదిగొచ్చిన కొడుకు ఎందుకు పనికిరాకుండా పోతున్నాడు అనే బాధతో. ఈ సినిమాలో కూడా వెంకటేష్ అలాగే తిరుగుతూ ఉంటే బాధ పడే తండ్రిగా కోటా శ్రీనివాస రావు నటించారు.

    అనుకోకుండా ఉద్యోగం సంపాదించిన వెంకటేష్ ఆ ఉద్యోగం ఇచ్చిన మహిళ వల్ల తన తండ్రిని కోల్పోతారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలలో కన్నీళ్లు పెట్టకమానరు. అంత బాగా తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా చూపించగలిగింది.

    నువ్వు నాకు నచ్చావు

    నువ్వు నాకు నచ్చావు

    అదేంటి ఒక మంచి కామెడీ సినిమాని తీసుకువచ్చి ఫాదర్ సెంటిమెంట్ సినిమా అంటున్నారు అని ఫీల్ అవ్వద్దు. ఈ సినిమాలో కామెడీ ఎంత బాగుంటుందో ఫాదర్ సెంటిమెంట్ కూడా అంతే బాగా చూపించారు. ఇప్పటికీ అమెరికా వెళ్లడం అనేది చాలా మంది కల. అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం సంపాదించి డాలర్లు తమ తండ్రికి పంపిస్తుంటే అదొక ఆనందంలా ఫీల్ అవుతారు.

    Recommended Video

    Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
    ఇంకెందుకు ఆలస్యం

    ఇంకెందుకు ఆలస్యం

    కానీ తాను అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించలేకపోయినా తన తండ్రితో కలిసి ఉంటూ రోజు కలిసి ఇంత అన్నం తిని గడిపితే చాలు అని వెంకటేష్ చెప్పే సీన్ మాత్రం ఇప్పటికీ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ బ్రైట్ ఫ్యూచర్ కోసం విదేశాల వెంట పడే అనేకమందికి కళ్ళల్లో నీళ్ళు తెప్పించడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ వీకెండ్ సమయంలో ఫాదర్ సెంటిమెంట్ సినిమా ఒకటి చూసేయండి మరి.

    English summary
    on the eve of world fathers day here is the top five Telugu Movies Made Based On Father-Son Relationship. here is the full list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X