టాప్ ట్రెండింగ్: 27 ఏళ్ల షారుక్ ఖాన్.. బాలీవుడ్‌ను శాసించాలనుకొన్నాడు.. ఆ పని చేసేశాడు
ఎలాంటి వారసత్వం లేకుండా బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన వారిలో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బాలీవుడ్‌ను ఏలేసిన ఘనతను షారుక్ దక్కించుకొన్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా పేరొందని షారుక్ ఖాన్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటికి 27 ఏళ్లు. జూన్ 25వ తేదీ, 1992లో దీవానా చిత్రంతో షారుక్ ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి గత 27 ఏళ్లుగా భారతీయ సినిమా పరిశ్రమలో జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. షారుక్ సుదీర్ఘమైన కెరీర్‌పై స్పందిస్తూ షారుక్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. నెటిజన్ల ట్వీట్లు మీకోసం

బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్
27 ఏళ్లుగా షారుక్ ఖాన్ అనే వ్యక్తి బాలీవుడ్‌ను కుదిపేసాడు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. బాలీవుడ్‌లో ట్రెండ్ సృష్టించాడు. ఎన్నో కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్నాడు. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని గెలుచుకోవాలనుకొన్నాడు. ఆ పనిని సమర్ధంగా పూర్తి చేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ప్రపంచంలోనే సంపన్న నటుడిగా
ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరు. ప్రపంచంలోనే సంపన్న నటుల్లో రెండో వ్యక్తి. యాక్టింగ్ దైవం లాంటివాడు. ఇలా చెప్పుకొంటూ పోతే షారుక్ గురించి ఎన్నైనా చెప్పవచ్చు. ఆయన సాధించిన ఘనతను ఎంతైనా చెప్పుకోవచ్చు. బాస్ మాదిరిగా 27 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమను పాలిస్తున్నాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

షారుక్ ఖాన్ అంటే
షారుక్ అంటే ఓ వ్యక్తి. మహా వ్యక్తి. ది బాస్, కింగ్ ఖాన్.. నా దైవం. అలాంటి షారుక్ ఖాన్ బాలీవుడ్‌లో 27 ఏళ్లు పూర్తి చేసుకొన్నాడు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అలాగే, విలన్‌గా కెరీర్ ప్రారంభించి, రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల మనసులను దోచుకొన్నాడు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటే మాకు చెప్పలేనంత ప్రేమ అని మరో ఫ్యాన్ తన ప్రేమను వ్యక్తం చేశాడు.

సూపర్‌స్టార్‌గా ప్రస్తుతం గడ్డు పరిస్థితి
బాలీవుడ్‌ను రెండు దశాబ్దాలకుపైగా శాసించిన షారుక్ ఖాన్ ప్రస్తుతం సక్సెస్‌లే లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన సినిమాలు వరుస ఫ్లాప్‌లు చెందాయి. ఇటీవల ఆయన నటించిన జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. అప్పటి నుంచి మరో సినిమాను అంగీకరించకపోవడం గమనార్హం. షారుక్ 27 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్బంగా సోషల్ల మీడియాలో భారత్ పరిధిలో నంబర్ వన్‌గా, ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో హంగామా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











